ఇప్పుడు ఏదైనా ట్రెండ్‌ అవ్వాలంటే పెద్ద టాలెంట్‌ అవసరం లేదు. చిన్న కామెంటు రాయగలిగితే చాలు… సోషల్ మీడియా దానిని ట్రూత్ ఆఫ్ ద డేగా ప్రకటిస్తుంది. ముఖ్యంగా సినిమావాళ్ల విషయంలో ఈ ట్రోలింగ్ కల్చర్ బాగా ప్రయోగిస్తున్నారు.

ఒకప్పుడు సినిమా విడుదలయ్యాకే ‘టాక్’ వస్తుండేది. ఇప్పుడు టైటిల్‌తోనే ‘టాక్ షో’ మొదలవుతోంది!ఓ సినిమా రిలీజైందంటే వెంటనే రిజల్ట్ చెప్పేస్తోంది. ఓ ట్రైలర్ వచ్చిందంటే రచ్చ చేసేస్తోంది. అలాగే ఓ సినిమా టైటిల్ బయట వస్తే వెంటనే తీర్పు ఇచ్చేస్తోంది. ఇప్పుడు పూరి జగన్నాథ్ తాజా చిత్రంపై దృష్టి పెట్టింది సోషల్ మీడియా.

రామ్ తో పూరి జగన్నాథ్ చేసిన డబుల్ ఇస్మార్ట్ డిజాస్టర్ అవడంతో ఆయన కెరీర్ ఇంకా అయిపోయింది అన్నారు అంతా. ఈ సారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నాడు.

అందులో భాగంగానే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో మల్టిఫుల్ లాంగ్వేజెస్ లో వస్తున్న ఈ సినిమాలో ఇప్పుడు క్యాస్టింగ్‌ను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు చిత్ర యూనిట్. అలాగే ఈ చిత్రానికి బెగ్గర్ అనే టైటిల్ ని పెట్టారని వార్త బయిటకు వచ్చింది. వెంటనే సోషల్ మీడియా ఎలర్టైపోయింది.

“బెగ్గర్?”
“పూరి జగన్నాథ్ తన కెరీర్‌ స్టేటస్ నే టైటిల్ లో పెట్టేసుకున్నాడేమో!”
“ఇది విజయ్ సేతుపతి కెరీర్‌కు పెద్ద మైనస్!”
“ఇంకా ఏం మిగిలింది పూరికి, బెగ్గర్ అవ్వటానికి?”

అయితే పూరి టైటిల్స్ తోనే మ్యాజిక్ చేసినవాడు. “టెంపర్”, “ఇడియట్”, “బిజినెస్‌మ్యాన్”, “పోకిరి” లాంటి సినిమాలతో ఆడియన్స్ మనస్సుల్లో ఒక ముద్రవేసినవాడు. ఆ కథలన్నీ డిఫరెంట్. ఇప్పుడు “బెగ్గర్” అనే టైటిల్ వెనుక — మనిషి విలువల గురించి ప్రశ్న ఉండకపోతుందా?

ఇలా ఓసారి ఆలోచించండి — “బెగ్గర్” అనేది కేవలం ఓ మాట కాదు. అది ఓ స్టేట్‌ ఆఫ్ మైండ్ కావచ్చు. ఓ భావన, ఓ ప్రశ్న, ఓ పోరాటం కావచ్చు.

, ,
You may also like
Latest Posts from