లైగర్, డబుల్ ఇస్మార్ట్‌తో వరుసగా ఫ్లాప్స్‌ తిన్న పూరి జగన్నాథ్‌ ఎలాగైనా పెద్ద హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు . ఒకప్పుడు టాలీవుడ్‌లో హీరోలు ఆయన కోసం డేట్స్‌ కట్టిపెట్టేవారు. కానీ ఇప్పుడు యంగ్ హీరోలు కూడా “పూరి సినిమానా?” అంటూ వెనకడుగు వేస్తున్నారు. అలాంటి టైంలో పూరి తన కొత్త ఆఫ్షన్‌గా తమిళ నటుడు విజయ్ సేతుపతిని ఎంచుకున్నాడు.

ఇండస్ట్రీలో టాక్ ఏమిటంటే – తెలుగు హీరోలు నో చెప్పడంతోనే పూరి సేతుపతిపై బెట్ వేసాడట!

ఈ ప్రాజెక్ట్‌కి పూరి చాలా అసాధారణమైన సెట్ వేశాడు. సాధారణంగా తక్కువ ఖర్చులో సినిమాలు పూర్తి చేసే పూరి, ఈసారి మాత్రం కోట్ల రూపాయల సెట్‌ వేసి షాక్ ఇచ్చేశాడు. ఈ భారీ సెట్‌లోనే క్లైమాక్స్‌, కీలక సీన్స్‌, అలాగే ఒక స్పెషల్‌ సాంగ్ ని షూట్ చేయబోతున్నారట. ఇంత ఖర్చు అంటే సినిమాలో ఆ సెట్‌ ఎంత క్రూషియల్‌ అని అర్థమవుతోంది.

టైటిల్‌గా “బెగ్గర్” ని ఫిక్స్ చేస్తున్నట్టే సమాచారం. ఈ సినిమాలో విజయ్ సేతుపతి మూడు విభిన్న షేడ్స్‌లో కనిపించబోతున్నాడట. అంటే, ఒకే సినిమాలో సేతుపతి మూడు గెటప్స్‌ – అదే హైలైట్‌.

సోషల్ మీడియాలో ఇప్పటికే ఫ్యాన్స్ ఒకే ప్రశ్న వేస్తున్నారు –

“ఈ బెగ్గర్ సినిమాతో పూరి తన పాత గౌరవం తిరిగి తెచ్చుకుంటాడా? లేక ఇది కూడా మరో రిస్క్ అవుతుందా?”

పూరి ఫ్యాన్స్ మాత్రం క్లియర్‌గా చెబుతున్నారు: “ఈసారి హిట్ రాకపోతే, పూరి కెరీర్‌కి గట్టి బ్లో ఖాయం”.

, , ,
You may also like
Latest Posts from