పాన్ ఇండియా అంటే ఏంటో చెప్పే సినిమా ఏదైనా ఉందంటే… అదే ‘పుష్ప 2’. ఒకప్పుడు “సౌత్ సినిమా”గా చూసిన పుష్ప 1 హిట్టయింది. కానీ పుష్ప 2? అది వన్ సైడ్ గేమ్. దేశం మొత్తాన్ని మడతెట్టేసిందీ సినిమా. ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో ఇప్పుడు నంబర్ వన్ సినిమాగా నిలిచింది.

ముఖ్యంగా పుష్ప 2 ఉత్తరాదిలో దూసుకెళ్లింది. అసలు దక్షిణాది కంటే ఉత్తరాదిలోనే ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఎందుకు? ఏముంది ఇందులో? ఇక్కడే నాగార్జున ఎనాలసిస్ చేసారు.

వేవ్స్ సమ్మిట్ లో మాట్లాడిన నాగార్జున సూటిగా చెప్పేశారు

“పుష్ప 2 కథ.. ఈ ప్రజెంటేషన్.. నార్త్ ఆడియన్స్‌కి చాలా కొత్తగా అనిపించింది. ‘పుష్ప 2’ టైపు నెరేషన్‌ను బాలీవుడ్ మర్చిపోయింది. అలాంటి సౌత్ మాస్ నెరేషన్ ఇప్పుడు వాళ్లకు చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తోంది.”

అలాగే ఇటువంటి మాస్ స్టోరీ టెల్లింగ్ స్టైల్ సౌత్ లో చాలా కామన్. కానీ బాలీవుడ్ లో అవి కరువయ్యాయి. ఫలితంగా… ఉత్తరాది ప్రేక్షకులు ఆ “గ్రౌండ్‌డ్ యెట్ స్టైలిష్” నేరేషన్‌కి గట్టిగా కనెక్ట్ అయ్యారు అని నాగ్ తేల్చి చెప్పారు.

నాగ్ చేసిన ఈ ఒక్క కామెంట్‌తోనే… పుష్ప సక్సెస్ ఫార్ములా బయటపడింది.

భారతీయ సినిమాల నెరేషన్ లో గల గ్యాప్ స్పష్టమైంది. అల్లు అర్జున్ పాన్ ఇండియా ఇమేజ్ వెనుక నిజమైన కారణం తెలిసిపోయింది.

ఇది ఇంకా ఓ టాలీవుడ్ విజయం మాత్రమే కాదు… దేశం మొత్తం నలుమూలలా “ఊ అంటావా మామా… ఊఊ అంటావా” అంటూ ఊగిపోయిన విజయం!

, , ,
You may also like
Latest Posts from