
PVR కొత్త ప్లాన్ : తగ్గింపు టిక్కెట్ రేట్లుకే మల్టిప్లెక్స్
భారతదేశంలో అత్యధిక మల్టీప్లెక్స్ స్క్రీన్లను కలిగి ఉన్న PVR INOX మరో పెద్ద విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (FY26) మరో 100 కొత్త స్క్రీన్లు ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నది. ఈసారి ఫోకస్ స్పష్టంగా టియర్-2, టియర్-3 నగరాలపైనే.
ఈ చిన్న పట్టణాలలో ప్రేక్షకులను ఆకర్షించేందుకు, PVR INOX లో-కాస్ట్ టికెట్ మోడల్ ను అమలు చేయాలని చూస్తోంది.
వార్తల ప్రకారం, కొత్తగా తెరవబోయే ఈ 100 స్క్రీన్లకు సగటు టికెట్ ధరను ₹150–₹200 మధ్యగా నిర్ణయించాలని కంపెనీ ఆలోచిస్తోంది. దీంతో సినిమా చూడటం మరింత మంది ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
1997లో భారతదేశానికి మల్టీప్లెక్స్ కాన్సెప్ట్ ను పరిచయం చేసిన PVR (Priya Village Roadshow) ప్రస్తుతం ఇండియా, శ్రీలంకల్లో అతిపెద్ద ప్రీమియమ్ సినిమా ఎగ్జిబిషన్ చైన్‌గా ఉంది. అత్యాధునిక ఫార్మాట్లు, లగ్జరీ సౌకర్యాలు అందిస్తూ, మూవీ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తూ వస్తోంది.
