తెలుగు తెరపై ఓ వేగంగా పరుగెత్తిన నక్షత్రం, ఈ మధ్యన కనపడకుండా పోయింది, అయితే ఆమె రీ ఎంట్రీ కోసం ప్రయత్నిస్తోంది. ఆమే రాశీ ఖన్నా. “ఊహలు గుసగుసలాడే” నుంచి “ప్రతిరోజూ పండగే” వరకు తన అందం, అభినయం, హుషారుతో మనసుల్ని దోచేసిన ఈ ముద్దుగుమ్మ… కొంతకాలంగా తెలుగులో అవకాశాలు తగ్గాయి.

బాలీవుడ్ ప్రయాణంలో బిజీ అయిపోయిన రాశీ, ఇప్పుడు మళ్లీ తాను ఒక తుపానుగా తిరిగి వస్తున్నానంటూ ఘాటైన స్టేట్‌మెంట్ ఇచ్చింది – అది కూడా రక్తం చిందించే స్టైల్లో!

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ముక్కుపై గాయం, చేతిపై రక్తం, తల నెత్తిన గాయాలుతో రాశీ కనిపించడం అభిమానులను షాక్‌కు గురి చేసింది. ఫోటోలకే కాదు… క్యాప్షన్‌కే అసలు హైలైట్:

“కొన్ని పాత్రలు అడగవు… డిమాండ్ చేస్తాయి! మీ శరీరాన్ని, మీ గాయాలను కూడా. మీరు తుపానుగా మారినపుడు… పిడుగులు ఏమాత్రం పట్టించుకోవాలా?”

ఈ స్టేట్‌మెంట్ చూస్తుంటే, ఆమె నటిస్తున్న కొత్త ప్రాజెక్ట్ యాక్షన్ ఓరియెంటెడ్, ఫిజికల్ గా డిమాండ్ చేసే పాత్ర అన్నది స్పష్టమవుతోంది. తెలుగులో ప్రస్తుతం “తెలుసు కదా” అనే సినిమాతో సిద్దు జొన్నలగడ్డతో జోడీ కట్టిన రాశీ, హిందీలో “TME” అనే యాక్షన్ మూవీతో పాటు ఫర్జీ 2 వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది.

గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా ఆమెను ప్యాషన్‌తో, గ్లామర్ కళ్లతో చూసే దర్శకులకు ఇది ఒక అదిరిపోయే సిగ్నల్. “నన్ను ఇంక ఈజీగా తక్కువ అంచనా వేయొద్దురా!” అని బాడీపై గాయాలతో చెప్పకనే చెబుతోంది రాశీ.

తెలుగులో మళ్లీ ఓ మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్‌గా నిలదొక్కుకోవాలనే ఆమె ప్రయత్నం, ఈ పోస్టుతో మరోసారి హైలైట్ అయింది. రాశీ ఖన్నా Comeback ఖచ్చితంగా గట్టిగా ఉండబోతుందని చెప్పడంలో సందేహమే లేదు.

స్కూల్ డేస్ లో బాగా చదువుకోని ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్న రాశి ఖన్నా, అనుకోకుండా మోడలింగ్ వైపు వచ్చి అటు నుంచి హీరోయిన్ అయ్యింది.

ఈ డిల్లి బ్యూటీ నటించిన మొదటి సినిమా ‘మద్రాస్ కేఫ్’ హిందీలో సూపర్ హిట్ అయ్యింది. డెబ్యుతోనే హిట్ కొట్టిన రాశి, అక్కడి నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

మొదటి సినిమా ‘ఊహలు గుసగుస లాడే’ మంచి హిట్ అయ్యింది. ఈ సినిమా చూసిన వాళ్లు రాశి ఖన్నాకి బాగానే కనెక్ట్ అయ్యారు. ఇంతకన్నా ముందు అక్కినేని త్రయం నటించిన ‘మనం’ సినిమాలో కాసేపు కనిపించింది.

ఎన్నో సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నా కొందరు హీరోయిన్స్ కి తెలుగు రాదు, రాశి ఖన్నా మాత్రం మొదటి సినిమాతోనే తెలుగు నేర్చుకోవడం కాకుండా పాటలు కూడా పడింది.

You may also like
Latest Posts from