

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది రాజాసాబ్’ చుట్టూ రూమర్స్ వరుసగా హీట్ క్రియేట్ చేస్తున్నాయి. సినిమాకు డిసెంబర్ 5న రిలీజ్ ఉంటుందంటూ, మళ్లీ సంక్రాంతి 2026కి వాయిదా పడుతుందంటూ, షూట్, పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం అవుతోందంటూ ఊహాగానాలు తెగ వినిపిస్తున్నాయి. దీంతో నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. “ డిసెంబర్ రిలీజ్ ప్లాన్ లేదు. రాజా సాబ్ ఖచ్చితంగా సంక్రాంతి 2026కే వస్తుంది ” అంటూ కన్‌ఫర్మ్ చేశారు.
ఈ పాన్ ఇండియా చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా ఈ నెల 18నుంచి కేరళలో కొత్త షెడ్యూల్ ప్రారంభించుకోనుందని సమాచారం. దాదాపు వారం పాటు సాగే ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌పై ఓ పాట చిత్రీకరించనున్నారని.. దీనికి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ డాన్స్ అందిస్తారని తెలిసింది. ఇక దీని తర్వాత అక్టోబరులో గ్రీస్‌లో మరో షెడ్యూల్ మొదలు కానుందని.. అక్కడే మూడు పాటలు తెరకెక్కిస్తారని తెలుస్తోంది.
పోస్టర్‌తో రూమర్స్‌కు చెక్!
ఈ గాసిప్స్ అన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేందుకు, రిలీజ్ డేట్‌తో కూడిన అధికారిక పోస్టర్‌ని చాలా త్వరలో రిలీజ్ చేయబోతున్నట్టు టీమ్ ఇంటర్నల్‌గా డిసైడ్ అయ్యిందట.
షూట్ స్టేటస్ ఏంటి?
మారుతి ఇప్పటికే టాకీ పార్ట్, ప్యాచ్‌వర్క్ పూర్తి చేశాడు. అక్టోబర్‌లో పెండింగ్‌లో ఉన్న రెండు పాటల్ని షూట్ చేయనున్నారు. అందులో ఒక చిన్న యాక్షన్ ఎపిసోడ్‌ను ప్రభాస్ ఈ నెలలోనే షూట్ చేస్తాడట. రెండు భారీ సాంగ్స్ కోసం యూరప్ ప్లాన్ చేశారు. అంటే, పోస్ట్ ప్రొడక్షన్‌కి బాగా టైమ్ దొరుకుతుందన్నమాట.
వీఎఫ్ఎక్స్‌పై డబుల్ కేర్!
‘మిరాయ్’ సక్సెస్ తర్వాత, రాజా సాబ్ వీఎఫ్ఎక్స్ వర్క్‌పై ఆడియన్స్ అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. అందుకే మారుతి ఎక్స్‌ట్రా కేర్ తీసుకుంటున్నాడట. మ్యూజిక్ మాంత్రికుడు థమన్ ట్యూన్స్ కట్టేస్తుండగా, మలవికా మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్‌లుగా అలరించబోతున్నారు.
400 కోట్ల గేమ్..!
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీగా రూ.400 కోట్ల బడ్జెట్‌తో ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్ చేసింది. థియేట్రికల్, నాన్-థియేట్రికల్ డీల్స్ కూడా త్వరలో ఫైనల్ కానున్నాయి.
రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబవుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రెండు కోణాలున్న పాత్రలో కనువిందు చేయనున్నట్లు తెలిసింది. ఈ చిత్ర తొలి ట్రైలర్‌ను వచ్చే నెల ‘కాంతార: చాప్టర్ 1’ సినిమాతో పాటుగా విడుదల చేయనున్నారు. అలాగే మొదటి గీతాన్ని ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబరు 23న బయటకు వదలనున్నారు. ఈ సినిమా జనవరి 9న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తుండగా.. కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.
అంటే రూమర్స్ అన్నీ పక్కన పెట్టేసి, రాజా సాబ్ టీమ్ బిగ్ అనౌన్స్‌మెంట్‌తో మాస్ ఫ్యాన్స్‌కు క్లారిటీ ఇవ్వబోతోందన్నమాట.