గేమ్ ఛేంజర్ ఫెయిల్యూర్ ఎఫెక్ట్ రామ్ చరణ్ పై పడలేదు. ఆయన డేట్స్ కోసం తెలుగు, హిందీ నిర్మాతలు చక్కర్లు కొడుతున్నారు. డైరక్టర్స్ ఆయనకు కథలు చెప్పాలని ప్రదిక్షణాలు చేస్తున్నారు. అయితే రామ్ చరణ్ ఆచి,తూచి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఓ బాలీవుడ్ ప్రాజెక్టు విషయమై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రామ్ చరణ్ కు సన్నిహితుడైన నిర్మాత మధు మంతెన ఓ ప్రపోజల్ ఆయన దగ్గర పెట్టినట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ నిర్మాత మధు మంతెన రామ్ చరణ్‌తో మంచి అనుభందం ఉంది. చరణ్ సాధారణంగా ముంబైలో ఉన్నప్పుడు మథు మంతెన కి హోస్ట్‌గా ఉంటాడు. ప్రస్తుతం మధు మంతెన రామ్ చరణ్‌తో ఓ స్క్రిప్ట్ చర్చిస్తున్నాడు.

ఇందుకోసం హిందీ దర్శకుల జంట చర్చలు జరుపుతోందని తెలుస్తోంది. అయితే ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ప్రస్తుతానికి ఏదీ ఖరారు కాలేదు కానీ సరైన స్క్రిప్ట్ , దర్శకుడు దొరికితే చరణ్ చేస్తానని మధు మంతెనతో కమిట్ అయ్యాడు. మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నారు. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు . ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఈ సినిమా షూటింగ్ ఈ సంవత్సరం చివరిలో పూర్తి కానుంది.

అలాగే రామ్ చరణ్ కు సుకుమార్‌పై కమిట్‌మెంట్ ఉంది. కానీ టాప్ డైరెక్టర్ షూటింగ్ ప్రారంభించడానికి చాలా కాలం కావాలనుకున్నాడు.

సుకుమార్ స్క్రిప్ట్ కోసం ఒక సంవత్సరం వెచ్చించాలనుకుంటున్నాడు . దానికి తోడు సుకుమార్ తన నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ కోసం కూడా కమిట్మెంట్స్ తో ఉన్నాడు.

ఈ సమయంలోనే రామ్ చరణ్ మరో సినిమాను పూర్తి చేయడానికి ఇంట్రస్ట్ గా ఉన్నాడు. అతను వివిధ చిత్రనిర్మాతలతో చర్చలు ప్రారంభించాడు.

You may also like
Latest Posts from