సినిమా వార్తలు

రామ్ చరణ్ డబుల్ మేకోవర్‌, ‘పెద్ది’ మామూలుగా ఉండదట!

‘గేమ్ చేంజర్’ తరువాత రామ్ చరణ్ కొత్త లుక్‌లో కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు. బుచ్చి బాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ కోసం ఆయన దట్టమైన గడ్డం, పొడవాటి జుట్టుతో రగ్గడ్ లుక్‌కి మారి ఇప్పటికే ఫ్యాన్స్‌కి సర్ప్రైజ్ ఇచ్చాడు.

ఇప్పుడు తాజా సమాచారం ఏమిటంటే… చరణ్ మరో మేకోవర్‌కి కూడా సిద్ధమవుతున్నాడట. స్టార్ హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ హకీమ్‌తో చరణ్ డిస్కషన్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, సినిమాలో ఆయన డిఫరెంట్ లుక్స్‌లో కనపడతాడని టాక్ మొదలైంది.

ఈ వార్తతో ఫ్యాన్స్‌లో అంచనాలు మరింత పెరిగాయి. బుచ్చి బాబు సనా ఎంత బోల్డ్‌గా స్క్రీన్‌ప్లే ప్లాన్ చేశాడో, రామ్ చరణ్ పాత్రలో ఏ కొత్తదనం చూపించబోతున్నాడో అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.

వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మార్చి 2026లో విడుదల కానుంది.

Similar Posts