ఈ మధ్య కాలంలో రానా దగ్గుబాటి సోలో హీరోగా కనిపించి చాలా కాలం అయ్యింది. ఆయన నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా చాలా చిత్రాలతో బిజీగా ఉన్నాడు.అలాగే పెద్ద ఓటిటి సంస్థలకు కంటెంట్‌ అందిస్తూ సహ-నిర్మాతగా కూడా చేస్తున్నాడు. ఆ మధ్యన డైరక్టర్ తేజతో ఓ సినిమా కోసం చర్చలు జరిపాడు కానీ అది ఆగిపోయింది. అయితే తాజాగా రానా ఓ భారీ ప్రాజెక్టులో కీలకమైన పాత్రకు సైన్ చేసారని తెలుస్తోంది.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తేజ సజ్జా రాబోయే చిత్రం మిరాయ్‌లో రానా దగ్గుబాటి కీలక పాత్రను పోషించనున్నారు. ఈ చిత్రం మల్టీ స్టారర్, ఈ భారీ బడ్జెట్ ప్రయత్నంలో మంచు మనోజ్ ప్రధాన విలన్ పాత్రను పోషిస్తున్నారు. రానా దగ్గుబాటి త్వరలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.

మిరాయ్.. సూపర్ యోధ అనే క్యాప్షన్‌తో రాబోతోంది. ఈ చిత్రంలో మంచు మనోజ్ యాంటీగా కనిపించబోతోన్నాడు. మనోజ్, తేజ సజ్జా మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు అదిరిపోతాయట.

ఇక తేజ సజ్జా మళ్లీ ఓ సూపర్ హీరో పాత్రలో కనిపించి మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇక త్వరలోనే షూట్ ఫినిష్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా కానున్నారు.

You may also like
Latest Posts from