
రష్మిక మందన్నా “థమ్మా” ఇప్పుడు OTTలోకి! కానీ అందరికీ కాదు… కారణం షాకింగ్!
దీపావళి సమయంలో థియేటర్లలో విడుదలైన రష్మిక మందన్నా – ఆయుష్మాన్ ఖురానా జంట సినిమా “థమ్మా”, మొదట మోడరేట్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో స్టార్ట్ అయినా, బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా రాణించి ప్రపంచవ్యాప్తంగా ₹180 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
ఇప్పుడు ఈ ఫ్యాంటసీ హారర్ రొమాన్స్ థ్రిల్లర్ OTT ప్రేక్షకులను టార్గెట్ చేస్తోంది — కానీ, ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది!
తాజా సమాచారం ప్రకారం, “థమ్మా” డిసెంబర్ 2న Prime Videoలో స్ట్రీమింగ్‌కి వస్తుంది. అయితే, అది అన్ని యూజర్లకు అందుబాటులో ఉండదు!
మొదట ఈ సినిమా “రెంట్ బేసిస్” లో మాత్రమే అందుబాటులో ఉంటుంది — అంటే మీరు డిసెంబర్ 2 నుంచి “థమ్మా”ని ప్రైమ్ వీడియోలో అద్దెకు తీసుకుని మాత్రమే చూడగలరు. ఆ తర్వాత, ఎనిమిది వారాల థియేట్రికల్ విండో పూర్తయ్యాక మాత్రమే రెగ్యులర్ సబ్‌స్క్రైబర్స్‌కి ఫ్రీ స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది.
అదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మ్యాడాక్ హారర్ కామెడీ యూనివర్స్ (MHCU) లో భాగం. భారతీయ బేతాళ పురాణం ఆధారంగా తెరకెక్కిన ఈ కథలో ఒక జర్నలిస్ట్ (ఆయుష్మాన్) ఓ యువతి (రష్మిక)ని కలుసుకుంటాడు —కానీ ఆమె మనిషి కాదు… ఒక బేతాళి, రక్తం తాగే జీవి.
