పాత పాటలు కొత్త సినిమాల్లో రీమిక్స్ చేయటం ఆ మద్యన తెగ జరిగింది. అయితే ఆ ట్రెండ్ ఆగింది. అయితే ఇప్పుడు మరో సారి రవితేజ ఆ ట్రెండ్ కు తెర తీయబోతున్నాడు. రవితేజ హీరోగా నటిస్తున్న “మాస్ జాతర” సినిమాలో ఆ రీమిక్స్ సాంగ్ కనపడబోతోంది. దర్శకుడు భాను భోగవరపు ఈ సాంగ్ ని రీమిక్స్ చేయించి తెరకెక్కిస్తున్నారు. ఈ మాట వినగానే వింటేజ్ రవితేజ ని చూడవచ్చు అని అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇంతకీ ఏ పాటను రీమిక్స్ చేయబోతున్నాడంటారా…
రవితేజ మూవీస్ లో సూపర్ హిట్ గా నిలిచిన “ఇడియట్” సినిమా నుండి ‘చూపుల్తో గుచ్చి’ సాంగ్ ను రీమిక్స్ చేయనున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. అప్పట్లో ఈ పాట యూత్ ను ఒక ఊపు ఊపింది, మళ్ళీ ఇన్నాళ్లకు ఈ పాటను రీమిక్స్ చేస్తే మరోసారి సూపర్ డూపర్ హిట్ అవ్వడం పక్కా. అయితే, ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియాలంటే, అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.
భీమ్స్ రవితేజతో కలిసి గతంలో ధమాకా, రావణాసుర వంటి సూపర్ హిట్ ఆల్బమ్స్ కి పని చేసారు. ఇక ఇప్పుడు, “మాస్ జాతర” సినిమాతో మరో సారి రవితేజ కెరీర్ లో బెస్ట్ మాస్ ఆల్బమ్ ఇవ్వబోతున్నారు.