
ప్రభాస్ హీరోగా నటించిన “కల్కి 2898 AD” సినిమా ఏ రేంజ్‌లో హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి, ఇండియన్ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచింది. ఈ బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్‌గా “కల్కి 2” తెరకెక్కనుంది. కానీ సినిమా ఇంకా మొదలు కాకముందే ఒక భారీ షాక్ బయటకొచ్చింది.
నిర్మాతలు వైజయంతి మూవీస్ నుండి వచ్చిన తాజా ప్రకటన ప్రకారం, ఈ సీక్వెల్‌లో హీరోయిన్ దీపికా పడుకోణే లేరని అధికారికంగా ప్రకటించారు.
అధికారిక ప్రకటన ఇలా ఉంది:
‘‘జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత మేం ఒక నిర్ణయానికి వచ్చాం. ‘కల్కి’ సీక్వెల్‌లో దీపిక భాగం కాదని అధికారికంగా తెలియజేస్తున్నాం. తొలి భాగం కోసం ఆమెతో సుదీర్ఘ ప్రయాణం చేసినప్పటికీ రెండో పార్ట్‌లో (Kalki 2) భాగస్వామి కాలేకపోయింది. గొప్ప టీమ్‌తో కల్కి సీక్వెల్ మీ ముందుకు వస్తుంది. భవిష్యత్తులో దీపిక మంచి సినిమాలతో అలరించాలని కోరుకుంటున్నాం’’ అని వైజయంతీ మూవీస్ పోస్ట్ పెట్టింది (Kalki 2 Update). నిర్మాణ సంస్థ ప్రకటనతో అభిమానులు షాక్ అవుతున్నారు.
ఎందుకు బయటికి వెళ్లింది దీపికా?
ఇండస్ట్రీ టాక్ ప్రకారం…
- నాగ్ అశ్విన్ ఆమె నుండి ఇంకా ఎక్కువ డేట్స్ అడిగారని,
- కానీ దీపికా ఇప్పటికే మరో బాలీవుడ్ బిగ్ ప్రాజెక్టులు, అలాగే అల్లూ అర్జున్ సై-ఫై డ్రామా #AA22xA6 కోసం కమిట్ అయిందని సమాచారం.
- ఫలితంగా, “కల్కి 2” కోసం వేచి చూడకుండా ముందుకు వెళ్లిపోయిందట.
మొదటి భాగం మొత్తం కథ దీపికా పాత్ర ‘సుమతి’ చుట్టూ తిరిగింది. అలాంటి కీలక పాత్రను పోషించిన హీరోయిన్ సీక్వెల్‌లో లేకపోవడం నిజంగా సర్ప్రైజింగ్ ట్విస్ట్‌గా మారింది.
ఇప్పుడు ప్రశ్న ఏంటంటే:
“కల్కి 2″లో దీపికా లేకపోతే, ప్రభాస్‌కు జోడీగా ఎవరిని తీసుకుంటారు? ఇదే టాలీవుడ్‌లో హాట్ టాపిక్!
