అభిమానులకు గ్లామర్ బ్యూటీ రెజీనా కసాండ్రా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగులో పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ‘పిల్లా నువ్వు లేని జీవితం‘, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్‘ లాంటి సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
అలాగే రెజీనా కసాండ్రా ఇప్పుడు తెలుగు, తమిళం కంటే బాలీవుడ్ ప్రాజెక్టులే ఎక్కువగా చేజిక్కించుకుంటోంది. తాజాగా ఆమె నటించేందుకు షురూ చేసిన చిత్రం మరెవరో కాదు… జాతీయ అవార్డు గ్రహీత మధుర్ భండార్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న “ది వైవ్స్”.
ఈ సినిమా బాలీవుడ్ సెలబ్రిటీ భార్యల జీవితాల్లో దాగి ఉన్న వాస్తవాలను వెలికితీసే బోల్డ్ డ్రామా. చాంద్ని బార్, ఫ్యాషన్ వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న మధుర్ భండార్కర్ మళ్లీ తన యథార్థ దృక్పథంతో ప్రేక్షకులను ఆకట్టేందుకు వస్తున్నారు.
ఈ చిత్రంలో రెజీనా కసాండ్రాతో పాటు మౌని రాయ్, సోనాలి కుల్కర్ణీలు ఇతర కీలకమైన భార్యల పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీపై తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ రెజీనా కసాండ్రా ఇన్‌స్టాగ్రామ్‌లో –
“కొన్ని కథలు ఈజీగా చెప్పేందుకు కాదు… అవి చెప్పాల్సిన అవసరం ఉన్నవే! ‘ది వైవ్స్’ అచ్చంగా అలాంటిదే. మధుర్ సర్ కెమెరా కళ్లలో భాగమవ్వడం గర్వంగా ఉంది” అంటూ రాసింది.
బాలీవుడ్‌లో రెజీనా కొత్త ఇన్నింగ్స్‌కి ఇది స్టార్టింగ్ పాయింట్ అనడంలో సందేహమే లేదు!