కొన్ని సంఘటనలు వింటానికే ఆశ్చర్యంగా ఉంటాయి. ముఖ్యంగా పాతకాలం సంఘటనలు ఇప్పటివారికి మరింత ఇంట్రస్టింగ్ గా అలా జరిగిందా అప్పట్లో అని నోస్ట్రాలజీ ఫీల్ ని కలగ చేస్తాయి. అవి లజ్జ సినిమా షూటింగ్ జరుగుతున్న రోజులు. లజ్జ సినిమా 2001లో రాజ్‌కుమార్ సంతోషి నిర్మించి దర్శకత్వం వహించిన హిందీ క్రైమ్ డ్రామా చిత్రం .

ఇందులో మనీషా కోయిరాలా ప్రధాన పాత్రలో వైదేహి అనే పాత్రలో నటించగా, రేఖ , అనిల్ కపూర్ , మాధురి దీక్షిత్ , అజయ్ దేవ్‌గన్ , జాకీ ష్రాఫ్ , మహిమా చౌదరి , జానీ లివర్ , సురేష్ ఒబెరాయ్ , శర్మన్ జోషి , డానీ డెంగ్‌జోంగ్పా , రజాక్ ఖాన్ , గుల్షన్ గ్రోవర్ మరియు ఆర్తి చాబ్రియా వంటి తారాగణం సహాయక పాత్రల్లో కనిపించారు.

ఇక అసలు విషయానికి వస్తే…నటి ఆర్తి ఛాబ్రియా తన మొదటి సినిమా ప్రాజెక్ట్ సెట్స్‌లో గంటల తరబడి ఏడుస్తూనే ఉంది. అందుకు కారణం సెట్స్‌లో సీనియర్ నటి రేఖ ఆమెను చెంపదెబ్బ కొట్టడమే.

డైరక్టర్ ముందుగా చెప్పకుండా నిజమైన ఎమోషన్ రావటం కోసం చెంపదెబ్బ సీన్ ని ప్లాన్ చేసారు. దాంతో రేఖ వెళ్లి ఆర్తి చాబ్రియాని కొట్టింది. అయితే అందరి ఎదురుగా ఇలా తనను కొట్టడం ఆర్తి ఛాబ్రియా జీర్ణించుకోలేకపోయింది.

షూటింగ్ లో భాగం అని తెలియకపోవటంతో సెట్ పై యూనిట్ అందరి ఎదురుగా చెంపదెబ్బ ఘటన ఆమెను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఓ మూలకి వెళ్లి ఏడుస్తూ కూర్చుండిపోయింది. అప్పుడు రేఖ, డైరక్టర్ రాజ్ కుమార్ సంతోషి వెళ్లి ఓదార్చి అసలు విషయం చెప్పారు. అయితే ఆ తర్వాత ఆ సినిమా ఆడకపోవటంతో బాలీవుడ్ లో పెద్దగా కొనసాగలేకపోయింది.

తెలుగులో ఆర్తి ఛాబ్రియా.. ఒకరికి ఒకరు , ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి , చింతకాయల రవి మరియు గోపి – గోడ మీద పిల్లి వంటి అనేక చిత్రాలలో నటించింది .

You may also like
Latest Posts from