రీసెంట్ గా విజయ్ దేవరకొండ చేసిన కొన్ని వ్యాఖ్యలు రెట్రో మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్‌లో వైరల్ కావడమే కాకుండా వివాదంగా మారాయి. ట్రైబల్స్‌ను అవమానించారంటూ ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్ ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇంతవరకూ సైలెంట్‌గా ఉన్న విజయ్… ఇప్పుడు స్పందించారు. “వినిపించింది వేరేలా అయి ఉండొచ్చు, కానీ ఉద్దేశం అది మాత్రం కాదు!” అన్నారు.
విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ,
‘రెట్రో ఆడియో లాంచ్ ఈవెంట్‌లో నేను చేసిన కామెంట్స్ కొంతమంది ప్రజల్లో ఆందోళన కలిగించిందని నా దృష్టికి వచ్చింది. దీనిపై నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఎవ్వరినీ ఉద్దేశపూర్వకంగా హర్ట్ చేయాలని అలా మాట్లాడలేదు. నేను వారిని ఎంతో గౌరవిస్తాను. మన దేశ సమగ్రతలో భాగంగా భావిస్తాను.
నేను యూనిటీ గురించి మాట్లాడాను. భారతదేశం ఎలా ఒకటి, మన ప్రజలు ఒకటి, మనం ఎలా కలిసి ముందుకు సాగాలి అనే దాని గురించి మాత్రమే కామెంట్ చేశాను. ఏ ఒక్కరినీ కించపరిచేలా ఉద్దేశపూర్వకంగా అలాంటి కామెంట్స్ చేయలేదు. నేను ట్రైబల్స్ అనే పదం వేరే సెన్స్‌లో వాడాను.
నేను ఎప్పుడూ ఎవరిపైనా ఉద్దేశపూర్వకంగా వివక్ష చూపలేదు. వారందరూ నా కుటుంబసభ్యులు, సోదరులే అని భావిస్తాను. నా కామెంట్స్ వల్ల ఎవరైనా బాధ పడి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నాను. శాంతి గురించి మాట్లాడడమే నా ఏకైక లక్ష్యం.’ అని అన్నారు.