

తాజాగా థియేటర్లలో సెన్సేషన్ సృష్టించిన బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘సైయారా’ (Saiyaara) ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. జూలై 18న రిలీజ్ అయ్యి, ఎలాంటి ప్రచారం లేకుండా 400 కోట్లకుపైగా వసూళ్లు సాధించి రికార్డులు బద్దలుకొట్టిందీ ఈ చిన్న సినిమా. అలాగే టైటిల్ ట్రాక్ ఇప్పటికే 200 మిలియన్ల వ్యూస్ సాధించి మ్యూజిక్ లవర్స్‌ని ఊపేసింది.దాంతో ఓటిటిలో ఈ సినిమా చూడాలని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా ఓటిటి మ్యాజిక్ కోసం వెయిట్ చేస్తున్నారు.
కానీ ఇక్కడే పడింది ట్విస్ట్! ఈ రాత్రి నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో ‘సైయారా’ స్ట్రీమింగ్ అవుతున్నా.. కేవలం హిందీ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉండనుంది. తెలుగు వెర్షన్ లేకపోవడంతో టాలీవుడ్ ఆడియన్స్ పెద్ద షాక్‌లో ఉన్నారు.
‘సైయారా’ కథ – ప్రేమ, సంగీతం, గాయం, మళ్లీ పునర్జన్మ
వాణి బత్రా(అనీత్ పడ్డా) ఓ రైటర్. తన కాలేజీ సీనియర్ మహేశ్ అయ్యర్‌ని ప్రేమించి, ఇంట్లో వాళ్లని ఒప్పించి పెళ్లికి రెడీ అవుతుంది. కానీ చివరి నిమిషంలో అతడు తన స్వార్థం చూసుకుని ఈమెకు హ్యాండ్ ఇస్తాడు. దాదాపు ఆరు నెలల తర్వాత ఈ బాధ నుంచి కోలుకున్న వాణి.. ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరుతుంది. అదేరోజు అనుకోకుండా క్రిష్ కపూర్(అహన్ పాండే)ని కలుస్తుంది.
ఇతడో యంగ్ సింగర్. గుర్తింపు కోసం ప్రయత్నిస్తుంటాడు. ఊహించని పరిస్థితుల్లో క్రిష్-వాణి కలిసి ఓ పాట కోసం పనిచేయాల్సి వస్తుంది. అలా కొన్నాళ్లకు వీళ్లిద్దరూ ప్రేమలో పడతారు. కానీ వాణి జీవితంలోకి ఆమె పాత ప్రేమికుడు మహేశ్ వస్తాడు. మరి ఇద్దరిలో వాణికి ఎవరు దగ్గరయ్యారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.