కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు తన రీఎంట్రీ గురించి చివరికి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు! అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆమె కొత్త సినిమా ‘మా ఇంటి బంగారం’ షూటింగ్ ఈ మాసంలోనే ప్రారంభం కానుందని సమంత స్వయంగా ప్రకటించింది.

సోషల్ మీడియాలో అభిమానులతో చిట్‌చాట్ చేస్తూ, ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమంత సమాధానం ఇస్తూ –

“మీ అందరి ప్రశ్నలకు సమాధానం ఇదే. ఈ నెలలోనే ‘మా ఇంటి బంగారం’ షూట్ ప్రారంభం అవుతుంది. ఇది నా రీఎంట్రీ సినిమానే. చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాను,” అని చెప్పారు.

ఈ ప్రకటనతో సమంత అభిమానులు సెలబ్రేషన్ మూడ్‌లోకి వెళ్లిపోయారు!

గత కొంతకాలంగా ఆమె ఆరోగ్య సమస్యల కారణంగా సినిమాల నుంచి దూరంగా ఉండడంతో, “ఇక మళ్లీ నటించరట”, “రెండో పెళ్లికి రెడీ అవుతున్నారట” అంటూ ఎన్నో రూమర్స్ వైరల్ అయ్యాయి. అయితే ఈ ప్రకటనతో ఆ వదంతులన్నింటికీ సమంత పుల్‌స్టాప్ పెట్టేశారు.

ఇటీవల సమంత నిర్మాతగా ‘శుభం’ అనే చిత్రాన్ని నిర్మించినా, ఆమె నటిగా ఎప్పుడు తిరిగి వస్తారో స్పష్టత రాలేదు. ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’తో రీఎంట్రీ కన్‌ఫర్మ్ కావడంతో, అభిమానుల్లో ఎక్సైట్మెంట్ డబుల్ అయ్యింది.

‘ఖుషీ’ తర్వాత సమంత ఫుల్ లెంగ్త్ రోల్‌లో కనిపించబోతున్న ఈ సినిమా వుమెన్ సెంట్రిక్ సబ్జెక్ట్ అని, సమంత పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్‌ చెబుతోంది.

ఇక పర్సనల్ లైఫ్ విషయంలో దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె డేటింగ్‌లో ఉన్నారనే వార్తలపై సమంత సైలెంట్‌గా ఉన్నా, తాజా పోస్టుతో మాత్రం ఆమె తన ఫోకస్ 100% కెరీర్‌పైనే పెట్టినట్టు స్పష్టమైంది.

, , , ,
You may also like
Latest Posts from