సుమారు ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న సాయి దుర్గ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ అంటూ ఓ డిఫరెంట్ మూవీతో మన మందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తుంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం సంబరాల ఏటిగట్టుకు సంబంధించిన మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదే సమయంలో ఈ సినిమా గురించిన విశేషాలు బయిటకు వచ్చి అభిమానులకు షాక్ ఇస్తున్నాయి.
తాజాగా ఈ చిత్రం బడ్జెట్ బయిటకు వచ్చింది. ఫిల్మ్ నగర వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రాన్ని 125 కోట్లతో నిర్మిస్తున్నారు. ఇప్పటిదాకా అరవై ఐదు శాతం షూటింగ్ జరిగింది. సాయి తేజ్ కెరీర్ లో ఇదే పెద్ద బడ్జెట్. అయితే ఏ ధైర్యంతో ఇంత పెడుతున్నారనేది అర్దం కావటంలేదంటోంది ట్రేడ్.
ఈ సినిమాలో సాయి దుర్గ తేజ్ కి జోడీగా ఐశ్వర్య లక్ష్మి నటిస్తుండగా జగపతిబాబు, సాయికుమార్, అనన్య నాగళ్ళ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. “సంబరాల ఏటిగట్టు” చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు రోహిత్ కేపీ రూపొందిస్తున్నారు. “సంబరాల ఏటిగట్టు” కార్నేజ్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 25న సంబరాల ఏటిగట్టు సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.