హృదయకాలేయం సినిమా విడుదల తర్వాత సంపూర్ణేష్‌ బాబు కొన్ని విమర్శలు ఎదుర్కొన్నా ఆ తర్వాత అదే అతనికి ప్లస్‌ పాయింట్‌ అయ్యింది. దీంతో సంపూ సినిమా వస్తుందంటే మినిమం కామెడీ ఉంటుందని ప్రేక్షకులు ఫిక్స్‌ అయ్యారు. ఇక సంపూర్ణేష్‌ బాబుతో బడా నిర్మాణ సంస్థలు సైతం సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు. బిగ్‌బాస్‌లో పాల్గొని ఆకట్టుకున్నాడు. అయితే కెరీర్ పరంగా వెనకబడ్డాడు. ఇప్పుడు మళ్లీ ఫామ్ లోకి రావటానికి సోదరా టైటిల్ తో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం ట్రైలర్ రీసెంట్ గా రిలీజై,మంచి బజ్ తెచ్చుకుంటోంది.

సంపూర్ణేశ్‌బాబు (Sampoornesh Babu) నటిస్తోన్న తాజా చిత్రం సోదరా. ఈ సినిమాలో ఆర్తి, ప్రాచి బన్సాల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మన్మోహన్‌ మేనంపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సంపూర్ణేశ్‌కు తమ్ముడిగా సంజోశ్‌ నటించారు. ఈ మూవీని క్యాన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో చంద్ర చగన్ల నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను బేబీ డైరెక్టర్‌ సాయి రాజేశ్, నిర్మాత ఎస్కేఎన్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

ట్రైలర్ చూస్తే అన్నదమ్ముల పెళ్లి విషయంలో జరిగే పరిణామాలే కథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పెద్ద కుమారుడి పెళ్లి కోసం తల్లిదండ్రులు పడే తపన నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతందించగా.. శివ సర్వాణి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.

, ,
You may also like
Latest Posts from