వెంకటేష్ తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియెన్స్ పట్టం కడుతున్నారు. ఈ మూవీ కళ్లుచెదిరే వసూళ్లను రాబడుతూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.

ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కు తనకు ఓ స్పెషల్ టాలెంట్ ఉందని రివీల్ చేసింది. ఆ టాలెంట్ గురించి విన్నవారంతా షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ టాలెంట్ ఏమిటి.

ఐశ్వర్య రాజేశ్ స్పెషల్ టాలెంట్ ఏమిటంటే… ఎవరి సంతకాన్నయినా ఈమె ఇట్టే కాపీ కొడుతుందంట. యాజ్ ఇటీజ్ గా దాన్ని తిరిగి రీ-క్రియేట్ చేస్తుందట. దీన్నే ఫోర్జరీ అని కూడా అంటారు. ఈ ఫోర్జరీ కళలో తను క్వీన్ అంటోంది ఐశ్వర్య రాజేశ్.

ఎవరి సంతకాన్నయినా, 2-3 సార్లు ప్రాక్టీస్ చేసి పని పూర్తిచేస్తానని గర్వంగా చెబుతోంది. కాలేజ్ డేస్ లో తనకు పాఠాలు చెప్పిన టీచర్ల సంతకాలన్నింటినీ దాదాపు ఫోర్జరీ చేసిందంట ఈ  అమ్మాయి.

, , ,
You may also like
Latest Posts from