ఈ స్వాతంత్ర్య దినోత్సవ వారం War 2 , కూలీ భారీ కలెక్షన్లతో థియేటర్లలో హవా చూపించాయి. దీంతో బాక్సాఫీస్‌కి మళ్లీ చైతన్యం వచ్చి, ఆ ఉత్సాహాన్ని కొనసాగిస్తూ అనేక తెలుగు సినిమాలు సెప్టెంబర్ రిలీజ్ కోసం తేదీలు ఖరారు చేస్తున్నాయి.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ OG సెప్టెంబర్ 25కి స్లాట్ బుక్ చేసుకోగా, ప్రమోషన్ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. నెల మొదటి వారంలోనే అనుష్క శెట్టి ఘాటి , తేజ సజ్జా మిరాయి సినిమాలు సెప్టెంబర్ 5న నేరుగా బాక్సాఫీస్ పోటీలో తలపడనున్నాయి.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన కిష్కిందాపురి సెప్టెంబర్ 12న, తమిళ డబ్ చిత్రం భద్రకాళి సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఇదిలా ఉంటే, నందమూరి బాలకృష్ణ మోస్ట్ అవైటెడ్ అఖండ 2 సెప్టెంబర్ షెడ్యూల్ నుంచి తప్పుకునే అవకాశం ఉంది. దీంతో ఇతర సినిమాలకు కొంత మార్గం సుగమం కానుంది.
ప్రస్తుతం సెప్టెంబర్ రిలీజ్‌ల లిస్ట్ బాగానే నిండిపోయింది. ఇంకొన్ని సినిమాలు ఈ రేస్‌లో చేరే అవకాశమూ ఉంది.