దాదాపు ఆరేళ్ల తర్వాత రామ్‌ చరణ్‌ సోలో గా ప్రేక్షకులను పలకరించిన చిత్రం గేమ్ ఛేంజర్. ఇందులో ఆయన చేసిన అప్పన్న పాత్రకు ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే సినిమాకు పాజిటివ్ టాక్ రాలేదు. అంతటా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతోంది. అయినా సరే తాజాగా ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు చరణ్‌ కృతజ్ఞతలు తెలిపారు. తన హృదయంలో ‘గేమ్‌ ఛేంజర్‌’కు ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. ‘మీరు గర్వపడేలా.. అద్భుతమైన పెర్ఫామెన్స్‌ ఇవ్వడం కొనసాగిస్తా’ అని అభిమానులకు హామీ ఇచ్చారు. నిర్మాతలు సైతం దాదాపు రూ.400 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం తొలిరోజు రూ.186 కోట్లు రాబట్టిందంటూ ప్రకటన చేసారు. ఇలా హీరో,నిర్మాత సైతం సర్దుబాటు చేసుకున్నా శంకర్ మాత్రం రివర్స్ లో స్పందించారు.

తాజాగా ఈ సినిమాపై దర్శకుడు శంకర్ చేసిన కామెంట్స్‌ వైరల్‌గా మారాయి. శంకర్ మాట్లాడుతూ..‘‘గేమ్‌ ఛేంజర్‌’ అవుట్‌పుట్‌తో నేను సంతృప్తిగా లేను. నేను అనుకున్న దాని ప్రకారం ఈ సినిమా నిడివి 5 గంటల వరకు ఉండాలి. సమయాభావం వల్ల కొన్ని సీన్స్‌ కట్‌ చేయాల్సి వచ్చింది. దీంతో కథ అనుకున్న విధంగా రాలేదు’’ అని శంకర్‌ (Director Shankar) అన్నారు.

రామ్‌ చరణ్‌, ఎస్‌జే సూర్యల నటనపై డైరక్టర్ శంకర్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాపై వచ్చిన ఆన్‌లైన్‌ రివ్యూలు చూడలేదన్నారు. ఈ చిత్రానికి మంచి రివ్యూలు వచ్చినట్లు తాను విన్నానన్నారు. ప్రస్తుతం శంకర్‌ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. మరోవైపు కొందరు నెటిజన్లు మాత్రం ఆన్‌లైన్ రివ్యూలు చూడకపోతే నేటి జనరేషన్‌ ఆలోచనలు ఎలా తెలుస్తాయని అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు విడుదలైన నాటి నుంచి ఈ సినిమా వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) సినిమాని లీక్‌ చేస్తామంటూ బెదిరించిన వారిపై చిత్ర బృందం ఇటీవల సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు చేసింది. అలాగే, సోషల్‌ మీడియా వేదికగా సినిమాపై నెగెటివిటీ సృష్టిస్తున్న కొన్ని ఖాతాలపైనా కంప్లైంట్‌ ఇచ్చింది.

“గేమ్ ఛేంజర్” శంకర్ నుంచి తొలి తెలుగు సినిమా ఇది కావడంతో శంకర్ కూడా తన శైలిలో తెరకెక్కించే ప్రయత్నం చేశారు. మరి ఇదిలా ఉండగా ఈ సినిమాకి కథ మాత్రం తనది కాదు. మొదటిసారి తన కథ కాకుండా మరో దర్శకుడు కథతో తను సినిమా చేయడం జరిగింది.

,
You may also like
Latest Posts from