యాక్షన్, కామెడీ చిత్రాలకు ప్రత్యేక శైలిని అందించిన దర్శకుడు శ్రీను వైట్ల, టాలీవుడ్ టాప్ హీరోలతో అనేక హిట్ సినిమాలు అందించారు.ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా ఓ వెలుగు వెలిగాడు శ్రీను వైట్ల . అయితే గత కొంతకాలంగా ఆయన్ని వరస పరాజయాలు పలకరించటంతో పట్టించుకునే వాళ్లే కరువు అయ్యారు.

ఈ క్రమంలో డైరెక్టర్ శ్రీను వైట్ల మరోసారి బౌన్స్‌బ్యాక్‌కి రెడీ అవుతున్నారు! చాలా రోజులుగా స్క్రిప్ట్‌పై కష్టపడి, కొత్త స్టోరీతో ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మొదట ఈ ప్రాజెక్ట్‌కి హీరోగా నితిన్ పేరే వినిపించింది. కానీ ఇప్పుడు ఈ క్రేజీ సినిమా శర్వానంద్ చేతుల్లోకి వచ్చేసింది!

శర్వానంద్ స్క్రిప్ట్ వినగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం. అధికారిక ప్రకటన వచ్చే వారం రాబోతోంది. షూటింగ్ మాత్రం వచ్చే ఏడాది ఆరంభంలోనే మొదలుకానుంది.

యంగ్ రైటర్ నందు ఈ సినిమాకి కథ అందించగా, భారీ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ని నిర్మించబోతోంది. నటీనటులు, టెక్నీషియన్స్ ఫైనల్ చేసే పనిలో శ్రీను వైట్ల టీమ్ బిజీగా ఉంది.

“శర్వానంద్ + శ్రీను వైట్ల” కాంబినేషన్ అంటేనే క్యూరియాసిటీ పీక్స్‌లో ఉంది — ఈసారి వైట్ల మళ్లీ తన మార్క్ కామెడీతో సక్సెస్ సాధిస్తారా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్!

శ్రీను వైట్ల ‘నీకోసం’ చిత్రంతో డైరెక్టర్‌గా మారారు. రవితేజ, మహేశ్వరి జంటగా తెరకెక్కిన ఈ చిత్రం ఓ మోస్తరు హిట్ అందించినా శ్రీను వైట్లకి మాత్రం మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత ‘ఆనందం’తో ఆయనకు మంచి బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత సొంతం, వెంకీ, అందరివాడు, ఢీ, దుబాయ్ శ్రీను, రెడీ, కింగ్, దూకుడు, బాద్‌షా, ఆగడు, బ్రూస్‌లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ, విశ్వం.. వంటి చిత్రాలు తెరకెక్కించాడు.

ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల్లో వెంకీ, దుబాయ్ శ్రీను, ఆగడు, ఢీ, రెడీ చిత్రాలు బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. అయితే వరుస పరాజయాలతో ఆయన్ని పట్టించుకునేవారే లేకుండా పోయారు.

, , , ,
You may also like
Latest Posts from