టాలీవుడ్‌లో ‘సార్’, ‘కుబేరా’ వంటి హిట్స్ అందుకున్న ప్రతిభావంతుడు తమిళ నటుడు దనుష్, మరిన్ని తెలుగు ప్రాజెక్టులలో పని చేయాలనే ఉత్సాహంతో వచ్చాడు. ఇక్కడ తన మార్కెట్ ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగా స్వయంగా దర్శకత్వం వహించి హీరోగా నటించిన భావోద్వేగ ఎంటర్టైనర్ ‘ఇడ్లీ కడై’, అక్టోబర్ 1న తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’ గా విడుదలైంది.

అయితే షాకింగ్‌గా… తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను పూర్తిగా తిరస్కరించారు! థియేటర్లలో కనీసం ప్రేక్షకులు కూడా రాకపోవడంతో ఇది ఔట్‌రైట్ డిజాస్టర్‌గా మారింది. మరోవైపు తమిళంలో మాత్రం సినిమాకు డీసెంట్ రెస్పాన్స్ వస్తోంది.

తెలుగులో ‘కాంతారా: చాప్టర్ 1’ బలంగా స్టార్ట్ కావడం కూడా ‘ఇడ్లీ కొట్టు’ కలెక్షన్లపై భారీ ప్రభావం చూపింది.

ఈ సినిమాలో నిత్యా మీనన్, అరుణ్ విజయ్, శాలిని పాండే, సత్యరాజ్, ఆర్.పార్థిబన్, సముద్రఖని, రాజ్‌కిరణ్ వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. వండర్‌బార్ ఫిలిమ్స్, డాన్ పిక్చర్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి.

ఇక దనుష్ ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసిన హిందీ సినిమా ‘తేరే ఇష్క్ మేన్’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

మరి దనుష్‌కి తమిళంలో వస్తున్న హిట్స్, తెలుగులో ఎందుకు కిక్ ఇవ్వలేకపోతున్నాయి? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

, , , , , ,
You may also like
Latest Posts from