సినిమా వార్తలు

ఈ థియేటర్లలో ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫ్రీగా చూసేయండి

సినిమా ప్రమోషన్ కోసం సాధారణంగా దర్శక–నిర్మాతలు సంప్రదాయ పద్ధతులు వదిలి, క్రియేటివ్ స్టంట్లు, పబ్లిక్ కనెక్ట్ స్ట్రాటజీలు, వైరల్ క్యాంపెయిన్లు చేస్తూనే ఉంటారు. కానీ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టీమ్ వేసిన తాజా అడుగు మాత్రం నిజంగా ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసింది!

అఖిల్‌ రాజ్‌, తేజస్వి జంటగా, సాయిలు కంభంపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రేమకథ మంచి స్పందన తెచ్చుకుంది. ఇప్పుడు అయితే ఈ సినిమాను పూర్తిగా ఉచితంగా చూసే అవకాశాన్ని టీమ్ ప్రకటించింది — అదీ ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్నో ప్రముఖ థియేటర్లలో… మహిళలకు మాత్రమే!

“మా రాంభాయి కథ… ప్రతి మహిళ కోసం” — టీమ్ నుంచి బంపర్ గిఫ్ట్!

అధికారిక పోస్టర్‌తో టీమ్ తెలిపిన ప్రకారం, ఆంధ్రా, సీడెడ్ ప్రాంతాల్లోని ఎన్నో ఎంపిక చేసిన థియేటర్లలో ఈరోజు మహిళలు టికెట్ కౌంటర్ వద్దకు వెళ్లి, ఫుల్‌ ఫ్రీగా సినిమా చూడొచ్చు!

ఇది అభిమానులకు థ్యాంక్స్ గిఫ్ట్ మాత్రమే కాదు… సినిమాలోని ‘రాంభాయి’ పాత్ర మహిళలకు ఇచ్చే ధైర్యం, ప్రేరణను సెలబ్రేట్ చేయడమే లక్ష్యమని టీమ్ చెప్పింది. ఒక్కరోజే — ఈ ప్రత్యేక ఆఫర్!

ఆంధ్రా & సీడెడ్ ఉచిత ప్రదర్శన థియేటర్లు (మహిళల కోసం మాత్రమే)

విశాఖపట్నం: శ్రీ కన్య, జగదాంబ
విజయనగరం: కృష్ణ
శ్రీకాకుళం: సూర్య మహల్
రాజమండ్రి: ఊర్వశి కాంప్లెక్స్
కాకినాడ: పద్మ ప్రియ కాంప్లెక్స్
ఏలూరు: అంబికా కాంప్లెక్స్
తణుకు: శ్రీ వెంకటేశ్వర
మచిలీపట్నం: సిరి కృష్ణ
విజయవాడ: స్వర్ణ కాంప్లెక్స్
గుంటూరు: బాలీవుడ్
ఒంగోలు: గోపి
నెల్లూరు: సిరి మల్టీప్లెక్స్
కావలి: లత, మానస
చిత్తూరు: గురునాథ్
హిందూపురం: గురునాథ్
తిరుపతి: జయ శ్యామ్
నంద్యాల: నిధి
కర్నూలు: ఆనంద్
కడప: రవి
రాయచోటి: సాయి
అనంతపురం: SV సినీ మాక్స్

Similar Posts