స్టీరియో టైప్, టాక్సిక్ రోల్స్ ను రిజెక్ట్ చేయడం వల్ల కమర్షియల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన కెరియర్ స్లో అయ్యిందని అన్నారు ఒకప్పటి లవర్ బోయ్ సిద్దార్ద్ . హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ లో తను గాయని, రచయిత అయిన విద్యా రావుతో కలిసి టాక్సిక్ మస్కులినిటీ, టాక్సిక్ రోల్స్ పై మాట్లాడారు.

సిద్ధార్థ్ మాట్లాడుతూ ….”అమ్మాయిల్ని కొట్టడం, ఐటెం సాంగ్స్ చేయడం, హీరోయిన్ల నడుము గిల్లడం, అమ్మాయిలు ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చెప్పేటటువంటి స్టోరీలు, రోల్స్ ఎన్నో నా దగ్గరికి వచ్చాయి. కానీ వాటన్నింటినీ నేను రిజెక్ట్ చేసి పక్కన పెట్టాను “.

” ఇలా రిజెక్ట్ చేయడం వల్ల నేను సినిమా ఇండస్ట్రీలో స్లో అవ్వడమే కాదు, డిఫరెంట్ గా అనిపించవచ్చు. కానీ సహజంగానే నాకు నచ్చిందే నేను చేశాను “అని అన్నారు సిద్ధార్థ్.

“ఈ రోజు నేను అమ్మాయిల్ని రెస్పెక్ట్ చేస్తానని కొంతమంది చెబుతున్నారు. మరికొంత మంది పేరెంట్స్ కి, వాళ్ళ పిల్లలకి నేను బాగా నచ్చుతున్నాను. అలా నచ్చుతున్నాను అంటే వాళ్ల పిల్లలు నా సినిమాలను 15 ఏళ్ల క్రితం నుంచి చూస్తూ ఉండొచ్చు. ఇది నిజంగా ఒక గ్రేట్ ఫీలింగ్. ఆ ఫీలింగ్ కోట్లలో వెలకట్టలేనిది “.

“నా చుట్టూ ఉన్నవాళ్లు అగ్రెసివ్ గా, మాకోగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. చాలామంది అబ్బాయిలు పెయిన్ ను ఫీల్ అవ్వడానికే ఆలోచిస్తుంటే, నేను స్క్రీన్ పై ఏకంగా ఏడవడం అనేది సంతోషంగా ఉంది” అంటూ ఇండస్ట్రీలోని పలు ఇంట్రెస్టింగ్ విషయాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

You may also like
Latest Posts from