బాక్సాఫీస్ బాహుబలి ప్రభాస్, ఇంటెన్స్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో రాబోతున్న మాస్ ఫిల్మ్ “స్పిరిట్”! , ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే మీడియాలో హైప్ ఓ రేంజిలో క్రియేట్ అయ్యింది. ఎప్పుడు సినిమా ప్రారంభిస్తారు..ఎప్పుడు రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఆలస్యం అవుతుందంటూ ఓ వార్త సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది.
అయితే వీటికి తాజాగా నిర్మాత భూషణ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు!
“స్పిరిట్ షూటింగ్ మరో 2-3 నెలల్లో స్టార్ట్ అవుతుంది. ‘యానిమల్ పార్క్’ కంటే ముందు స్పిరిట్ వస్తుంది” అని ఆయన స్పష్టం చేశారు.
యానిమల్ 2 కాదు… ముందుగా స్పిరిట్!
సందీప్ వంగా రూపొందిస్తున్న “యానిమల్ పార్క్” స్పిరిట్‌కు ముందే వస్తుందనే ప్రచారానికి కూడా ఈ ప్రకటనతో చెక్ పడింది. స్పిరిట్ తర్వాతే యానిమల్ పార్క్ అంటూ భూషణ్ కుమార్ తేల్చేశారు. 2027లో ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.
ఇక మరో పుకారు కూడా క్లియర్!
ఇటీవల ప్రశాంత్ వర్మ – ప్రభాస్ కాంబోలో ఓ మూవీ రాబోతోందని వినిపించింది. కానీ తాజాగా వచ్చిన అప్‌డేట్‌తో ఆ గాసిప్‌కి కూడా పుల్‌స్టాప్ పడింది.
ఇప్పటికే ప్రభాస్ చేతిలో ఇలా వరుసగా సినిమాలు:
“రాజాసాబ్” విడుదలకు రెడీ
“స్పిరిట్” షూటింగ్ త్వరలో
“కల్కి 2898 AD – Part 2”
“సలార్ 2”
“కన్నప్ప”లో గెస్ట్ రోల్
ఓ మై గాడ్! ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇది నిజంగా ఫెస్టివల్ మూడ్!
“స్పిరిట్” అఫీషియల్‌గా మూవ్ అవుతుండటమే కాదు, డైరెక్టర్ సందీప్ వంగా స్టైల్‌లో బ్లడీ మాస్ సినిమా కోసం ఫ్యాన్స్ ఓపికతో వెయిట్ చేసేలా చేస్తోంది!