టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టులలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా మహేష్ బాబు ,ఎస్.ఎస్. రాజమౌళి సినిమా . ఈ సినిమా “SSMB 29” అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. భారీ యాక్షన్-అడ్వెంచర్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది, ఈ మూవీ బడ్జెట్ దాదాపు రూ. 1000 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

అలాగే ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే కథ అని, ఇందులో మహేష్ బాబు ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడని టాక్ నడుస్తోంది. ఈ మూవీపై ఒక్కో అప్‌డేట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది.

తాజా సమాచారం ప్రకారం… ఈ సినిమా కోసం రూ. 50 కోట్ల భారీ బడ్జెట్‌తో ఒక స్పెషల్ సెట్ ను వారణాసీలో నిర్మించారు. ఈ సెట్లోనే సినిమా ప్రధాన భాగం షూట్ చేయనున్నట్టు సమాచారం. మొత్తం మీద 100 రోజులకుపైగా ఈ సెట్లోనే షూటింగ్ జరుగనుంది.

ఇప్పటికే శ్రీలంకలో కొత్త షెడ్యూల్ ప్లాన్ చేయగా, సెప్టెంబర్‌లో వారణాసిలో షూట్ మొదలుకాబోతోంది. సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కి తగ్గట్టు రూపొందిస్తున్నారు. అటు హాలీవుడ్ మార్కెట్లను, ఇటు ఇండియన్ మాస్‌ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ సినిమా బిజినెస్ ప్లాన్ వేస్తున్నారు.

ఈ భారీ సెటప్ వార్తతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. రాజమౌళి స్టైల్లో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు సినిమాకే కాదు… ఇండియన్ సినిమా స్థాయికే గర్వకారణంగా నిలవబోతోందని టాక్.

ఇలాంటివి సినిమాలో ఇంకా ఎన్ని సర్ప్రైజులు ఉన్నాయో చూడాలి!

SSMB29 updates కోసం మా సైట్లో చూస్తూనే ఉండండి!

, , , , ,
You may also like
Latest Posts from