తమిళ సూపర్ స్టార్ సూర్య, పూజా హెగ్డే జంటగా రూపొందిన రొమాంటిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా రెట్రో (Retro Review). గత కొద్దికాలంగా వరుస ఫెయిల్యూర్స్‌తో ఉన్న సూర్య.. ఈ రెట్రో సినిమా ద్వారా బిగ్ బ్యాంగ్‌తో కమ్ బ్యాక్ ఇస్తాడని అభిమానులు ఆశించారు. అలాగే పూజ హెగ్డే …గత రెండు, మూడు సంవత్సరాలుగా డిజాస్టర్ సినిమాలతో కెరీర్ క్లోజ్ అయిందా? అన్నట్లుగా ముందుకు వెళ్తోంది. ఆమె కూడా ఈ సినిమాపై మంచి అంచనాలే పెట్టుకుంది. మరి వీరి అంచనాలను ఈ సినిమా కొనసాగించిందా..సినిమా ఏమైనా వర్కవుట్ అయ్యిందా..కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

గ్యాంగ్‌స్టర్ తిలక్ (జోజు జార్జ్) తన దత్త పుత్రుడు పారివేల్ కన్నన్ (సూర్య)ని తనలాగే పెంచుతాడు. తండ్రి కోసం క్రిమినల్ వ్యవహారాల్లో మునిగితేలుతూంటాడు. కానీ రుక్మిణి (పూజా హెగ్డే)తో ప్రేమలో మొత్తం రివర్స్. మాఫియా, స్మగ్లింగ్ యాక్టివిటీస్ కి స్వస్ది చెప్పాలని డిసైడ్ అవుతాడు. అయితే తిలక్ కు ఇది నచ్చదు. ఇక కన్నన్ …తన ప్రేయసితో పెళ్లి ఏర్పాటు చేసుకుంటే తన గ్యాంగ్ తో వచ్చి పడతాడు తిలక్. అప్పుడు బుజ్జి చెప్తాడు. కానీ అరెస్ట్ అవుతాడు. జైలుకు వెళ్తాడు.

ఇక పెంపుడు తండ్రి తిలక్‌ కి కావాల్సిన గోల్డ్ ఫిష్ సమాచారం పారివేల్ వద్ద ఉంటుంది. దాంతో పారివేల్ ని ఎలాగయినా పట్టుకుని విషయం తేల్చుకోవాలనుకుంటాడు. ఈలోగా అరెస్ట్ అయిన పారివేల్ జైలు నుంచి తప్పించుకొంటాడు. తనపై కోపంతో వదలేసి వెళ్లిన రుక్మిణి ఆచూకీ కోసం వెతుకులాట మొదలుపెడుతాడు. ఆమె అండమాన్ లో ఉందని తెలుసుకుని అక్కడకి వెళ్తాడు. కన్నన్ ని వెతుక్కుంటూ తిలక్ కూడా అక్కడికి వెళ్తాడు.

అయితే అక్కడ రాజ్ వేల్(నాజర్), అతని కొడుకు మైకేల్ రాజ్యం నడుస్తూంటుంది. వాళ్లు అండమాన్ లో జనాలను బానిసలుగా చేసుకుని తమ పనులు చేయించుకుంటూంటారు. అక్కడికి వెళ్లిన పారివేల్ ఏం చేసాడు. వెనకే వచ్చిన తిలక్ సంగతి ఏమిటి..చివరకు తో కోపం వదిలేసి రుక్మిణి..పారివేల్ ని ఏక్సెప్ట్ చేసిందా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్ ..

పిజ్జా సినిమా నుంచి డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథ,కథనంలో ఏదో ఒక వైవిద్యం చూపిస్తూ తన మార్క్ ని పటిష్టం చేసుకుంటూ వచ్చారు. అదే విధంగా 70-80ల నేపథ్యంలో నడిపి ఓ నోస్టాల్జి ఫీల్ ఇవ్వాలని ఆశించాడు. అంతకు తగ్గ సహకారం టెక్నికల్ టీమ్ ఇచ్చింది. అంతవరకూ బాగానే ఉంది కానీ .. కథ దాదాపు నలభై ఏభై ఏళ్ల క్రితం నేపధ్యంలో నడుస్తుంది కదా అని అప్పటి కథనే ఎంచుకుంటే ఎలా..

చాలా ప్రెడిక్టబుల్ కథ, ఇంట్రస్ట్ లేని సీన్స్, ఇంటెన్స్ లేని గ్యాంగ్ వార్ లు సినిమాపై ఆసక్తిని తగ్గిస్తూ పోతాయి. దానికి తోడు మనకు ఫీల్ ఇవ్వాలని..డైరక్టర్ సినిమాని బాగా స్లోగా నడుపుతూంటాడు. దాంతో చాలా సీన్స్ ఇంకా అవ్వవా..ఇలా సాగతీస్తున్నాడేంటిరా బాబు అనిపిస్తుంది. యాక్షన్ సీక్వెన్స్ మీద పెట్టిన దృష్టి మిగతా వాటిమీద పెట్టలేదనిపిస్తుంది. ఫస్టాఫ్ బాగానే నడిచిపోయినా సెకండాఫ్ నట్టడం మొదలెడుతుంది. యాక్షన్ ప్యాకెడ్ డ్రామాలకు సరైన ఎమోషన్ డెప్త్ , కొత్తదనం లేకపోతే సినిమాటెక్ ఎక్సపీరియన్స్ ఇవ్వటం కష్టం. ముఖ్యంగా థ్రిల్లింగ్ మూవ్మెంట్స్ ఇలాంటి కథనం నుంచి ఆశిస్తారు. అవి పెద్దగా లేవనే చెప్పాలి.

ఎవరెలా …

సూర్య చూడటానికి కొత్తగా ఉన్నాడు.కానీ అతని నటనకు ఈ కథ సపోర్ట్ ఇవ్వలేదనే చెప్పాలి. సినిమాలో ఎమోషనల్ డెప్త్ కొరవడింది. ఓ గ్యాంగస్టర్ కథను ఓ ప్రేమ కథతో మిక్స్ చేద్దామనే అనుకున్నాడు కానీ అది పూర్తిగా డలవప్ చేయలేకపోయాడు.

ఓ పూర్తి సినిమా చూసిన ఫీల్ ని ఇవ్వలేకపోయింది. హీరో క్యారక్టర్ లో కానీ కథలో కానీ ఆర్క్ కనపడదు. దాంతో సినిమా స్టైలిష్ గా కనపడుతుంది కానీ అందులో విషయం లేదనిపిస్తుంది. సినిమాలో సూర్య ఓ స్టార్ గానే కనిపిస్తాడు కానీ అతను నటించిన క్యారక్టర్ లో కనపడడు.

అయితే ఈ సినిమాలో డైరక్టర్ తన టెక్నికల్ టీమ్ ఫెరఫెక్ట్ గా చేసింది ఒకటే అది 1960 – 1993ల నాటి వాతావరణాన్ని.. ఫ్యాషన్‌ను చక్కగా రీక్రియేట్‌ చేయటం. ఈ క్రమంలో సంతోష్ నారాయణన్ సంగీతం బాగా ప్లస్ అయ్యింది.

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చాడు. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ 70ల నాటికి తీసుకెళ్లింది. అయితే షఫీక్ మొహమ్మద్ అలీ ఎడిటింగ్ సినిమాను సినిమాని దెబ్బకొట్టింది. ఫీల్ కోసం..సినిమాని డెడ్ స్లో గా నడపటం సహనానికి పరీక్ష పెట్టింది. దానికి తోడు మూడు గంటల రన్ టైమ్.

చూడచ్చా

ఇంత చెప్పాక కూడా ఈ సినిమాని చూడాలని ఆశపడుతున్నారంటే ఖచ్చితంగా మీరు సూర్య వీరాభిమాని అయ్యింటారు. ఈ సినిమా మీ కోసం తీసిందే..

, ,
You may also like
Latest Posts from