సూర్య (Suriya) హీరోగా వెట్రిమారన్.. ‘వాడి వాసల్’ (Vaadivaasal) చిత్రాన్ని మూడేళ్ల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. రకరకాల కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ ఇప్పటికే పలు సందర్భాల్లో వార్తలు వచ్చాయి. వాటిన్నటినీ కొట్టిపారేస్తూ వెట్రిమారన్ అప్‌డేట్ ఇచ్చారు. ‘విడుతలై పార్ట్2’పూర్తైన తర్వాత తప్పకుండా ‘వాడి వాసల్’ రెగ్యులర్ షూట్ తిరిగి మొదలుపెడతానని స్పష్టతనిచ్చారు. ‘వాడి వాసల్’ తర్వాత తాను ఏ ప్రాజెక్ట్ చేసేది తెలియదన్నారు. ఈ నేపధ్యంలో వాడివాసల్ చిత్రం ఎప్పుడు రిలీజ్ కానున్నదనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా ఈ విషయమై క్లారిటీ వచ్చింది. ‘వాడి వాసల్’ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయటానికి దర్శకుడు, హీరో నిర్ణయించుకున్నారు. అంటే 2026 సంక్రాంతికి ఈ చిత్రాన్ని మనం చూడబోతున్నారన్నమాట.
జల్లికట్టు ఇతివృత్తంగా ‘వాడి వాసల్’ తెరకెక్కనుంది. సూర్య, వెట్రిమారన్ తొలిసారి ఈ ప్రాజెక్ట్ కోసం కలిసి పని చేస్తున్నారు. 2021లోనే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటికీ కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. 2022లో షూట్ మొదలుకాగా.. సూర్యపై పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. సినిమాలో చూపించే ఎద్దు సన్నివేశాల కోసం లండన్‌లో సీజీ పనులు జరుగుతున్నాయని గతంలో వెట్రిమారన్ తెలిపారు.
‘వాడివాసల్’ చిత్రాన్ని వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సూర్య – వెట్రిమారన్ లతో కలిసి దిగిన ఓ ఫోటోని చిత్ర నిర్మాత థాను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. దీనికి ”ఇంటర్నేషనల్ వర్షిప్ కోసం ‘వాడివాసల్’ తెరుచుకుంటుంది” అనే క్యాప్షన్ పెట్టారు.
‘వాడి వాసల్’ జల్లికట్టు సాంప్రదాయ క్రీడ ఆధారంగా తెరకెక్కనున్నట్లు సమాచారం. దీని కోసం సూర్య జల్లికట్టులో శిక్షణ కూడా తీసుకున్నారు. ఆల్రెడీ రిలీజైన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మెడలో పులిగోరు ఉన్న తాడుతో న్యూ లుక్ లో సూర్య సర్ప్రైజ్ చేసాడు. మరో ఛాలెంజింగ్ రోల్ తో రాబోతున్నట్లు హింట్ ఇచ్చారు.
పోస్టర్ లో హరప్పా, సింధు నాగరికతకు సంబంధించిన బొమ్మలు కనిపించడం మరింత ఆసక్తిని కలిగించింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చనున్నారు.