తమన్నా ‘ఓదెల-2’తో నాగసాధువు అవతారంలో అదరగొట్టేందుకు సిద్ధమవుతోంది!ఈ క్రమంలో భారీ బిజినెస్‌తో దుమ్మురేపుతోంది సూపర్‌నేచురల్ థ్రిల్లర్. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌కు వొచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఈ సినిమా థియేటర్లలో ఏ స్థాయిలో వర్కవుట్ కాబోతోందో అర్థమవుతోంది! దాంతో ఈ సినిమా బిజినెస్ ఊపందుకుంది.
ట్రేడ్ లో సునామీ – థియేట్రికల్ హక్కులకు ₹10 కోట్లు!
టీజర్ రిలీజ్‌తో ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ సినిమా దూసుకుపోతోంది.
తెలుగు రాష్ట్రాలు + ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులు కలిసి ₹10 కోట్లు కు అమ్ముడయ్యాయి.
శంకర్, సురేష్ రెడ్డి కొవ్వూరి ఈ హక్కులను సొంతం చేసుకున్నారు.
మరోవైపు, నాన్-థియేట్రికల్ హక్కులు ₹18 కోట్లకు పైగా విక్రయమయ్యాయి.
తెలుగు శాటిలైట్ హక్కుల కోసం కూడా ఇప్పటికే పెద్దబెద్ద చానళ్ల మధ్య పోటీ మొదలైందట!
₹25 కోట్ల బడ్జెట్‌తో నిర్మాత మధు ఈ సీక్వెల్ ని తెరకెక్కించారు.
‘నాగసాధువు భైరవి’గా తమన్నా రఫ్ & రాఫ్టిక్ రోల్!
ఈసారి తమన్నా గ్లామర్ కాదు… గ్రిప్పింగ్ , మిస్టీరియస్ నేరేషన్‌కి కలసేలా నాగసాధువు భైరవి పాత్రలో మారిన తీరు ఆసక్తికరంగా మారింది. టీజర్‌లో ఆమె కనిపించిన కొన్ని సెకన్లు ప్రేక్షకుల్ని గూస్ బంప్స్ వచ్చేలా చేశాయి.
ఈ థ్రిల్లర్‌ని డైరెక్ట్ చేస్తున్న అశోక్ తేజకు ఇది ఒక కీలక ప్రాజెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. మరోవైపు, స్టార్ డైరక్టర్ సంపత్ నంది ‘క్రియేటర్’గా వ్యవహరిస్తుండటం చిత్రంపై నమ్మకాన్ని పెంచుతోంది. విజన్, ఎమోషన్, మిస్టరీ – అన్నీ కలిపిన ఓ థ్రిల్లింగ్ ప్యాకేజీగా ఇది మారబోతోంది.