ఒకప్పుడు ప్రేమలో మునిగి ప్రైవేట్ మూడ్‌లో కనిపించిన తమన్నా భాటియా ఇప్పుడు తన రూట్ మార్చింది. నటుడు విజయ్ వర్మతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు ఊహలు, వార్తలు వినిపించినప్పటికీ… ఈ ఏడాది ప్రారంభంలో ఆ బంధానికి ఫుల్ స్టాప్ పడింది. బ్రేకప్ అనంతరం చాలా మంది సెలబ్రిటీల్లా తమన్నా కూడా కొంతకాలం తానేం చెప్పదనీ, పబ్లిక్ అవాయిడేనని భావించారు. కానీ ఆమె స్పందన మాత్రం విరుద్ధంగా ఉండింది. దూరంగా వెళ్లడమే కాదు… తానేంటో, తన విలువలేంటో అందరికీ చూపిస్తూ తమ్మన్నా ఇప్పుడు తన స్టైల్‌లో బ్రేకప్‌కి రిప్లై ఇస్తోంది.

తమన్నా తనను వెనక్కి లాగే పరిస్థితులలోకి డిప్రెషన్ లోకి పోకుండా, గ్లామరస్ అవతారాలతో, రెడ్ కార్పెట్ రాయల్ లుక్స్‌తో, ప్రతి స్టెప్‌లోనూ మెరుస్తోంది. ఆమె లేటెస్ట్ ఫొటోషూట్లు, ఈవెంట్ లుక్స్ అన్నీ కూడా ఒకే మాట చెబుతున్నాయి – తమ్మన్నా ఇప్పుడు తన కథను తానే రాస్తోంది.

తమ్మన్నా ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు కేవలం ఫొటో గ్యాలరీ కాదు… అది ఒక స్టైల్ స్టేట్‌మెంట్, ఒక స్వతంత్రత ఆవిష్కరణ. ఎక్కడైనా కనిపించినా – బోల్డ్ డ్రెస్సింగ్ నుంచి, సాఫ్ట్ ఎథ్నిక్ లుక్స్ వరకు – తమ్మన్నా ధైర్యంగా, స్థిరంగా, గర్వంగా కనిపిస్తుంది.

తాజాగా ఆమె కెరీర్ కూడా గేమ్‌చేంజింగ్ ప్రాజెక్ట్స్ తో దూసుకెళుతోంది. వెబ్ సిరీస్‌లు, ఫీమేల్ లీడ్ కథలు, నయా జోనర్లు – అన్నింటిలోనూ తమ్మన్నా తన స్థానం సాధిస్తూ, ఒక కొత్త దశలోకి అడుగుపెడుతోంది. తమ్మన్నా ఇప్పుడు బ్రేకప్ గురించి కాదు… బ్రేక్‌అవుట్ గురించి మాట్లాడుతోంది. తన భవిష్యత్తును తానే నిర్మించుకుంటున్న తమన్నా, మనకో స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది – నువ్వు నీకే ఒక బ్రాండ్.

ఇది ఓ ముగింపు కాదు… ఒక కొత్త ప్రారంభం.
ఇక్కడ నుంచే మొదలవుతోంది తమ్మన్నా కొత్త అధ్యాయం!

,
You may also like
Latest Posts from