ప్రస్తుతం తెలుగు హీరోల్లో మహేష్ బాబుకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా నెక్స్ట్ లెవిల్. ఈ నేపధ్యంలో మహేష్ బాబు పేరు చెప్తే చాలు ఏ మేటర్ అయినా వైరల్ అయ్యిపోతుంది. ఈ నేపధ్యంలో తాజాగా ఓ విషయం మహేష్ బాబుతో లింక్ అప్ అయ్యి వైరల్ అవుతోంది. అదేంటో చూద్దాం.

హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో అదరగొట్టిన హీరో తేజ సజ్జా. ఇప్పుడీ కుర్రాడు మిరాయ్ అంటూ అద్భుతం చేయడానికి వస్తున్నాడు. సినిమాటోగ్రఫర్ కమ్ దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని తీసిన ఈ సినిమాకు సంబంధించి.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది మాత్రం మైండ్ బ్లోయింగ్ అన్నట్లు ఉంది. ఈ మూవీ ఒక విజువల్ వండర్‌ అన్నట్లుగా.. జస్ట్ మూడు నిమిషాల ట్రైలర్‌తో అంచనాలను పెంచేశారు మేకర్స్.

ఈ మధ్య కాలంలో వచ్చిన విఎఫ్‌ఎక్స్ బేస్డ్ సినిమాల్లో.. ది బెస్ట్ అవుట్ పుట్ ఇదే అనేలా మిరాయ్ ట్రైలర్ ఓ రేంజ్‌లో ఉంది. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు.. ప్రతీ ఫ్రేమ్ గూస్‌బంప్స్ ఇచ్చేలా ఉంది. ఈ మధ్య కాలంలో ఇంత యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్‌ వచ్చిన ట్రైలర్ మరోటి రాలేదనే చెప్పాలి. ఇలా టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొల్పిన “మిరాయి” ట్రైలర్ రిలీజైనప్పటి నుంచి సినిమాపై రకరకాల రూమర్స్ మొదలయ్యాయి.

ముఖ్యంగా, సినిమాలో కనిపించే లార్డ్ శ్రీరామ్ పాత్రను మహేష్ బాబు ఫీచర్స్ ఆధారంగా ఏఐతో డిజైన్ చేశారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై హీరో తేజ సజ్జా స్పష్టత ఇచ్చాడు.

“మహేష్ బాబు గారి లుక్‌ లేదా ఫీచర్స్‌ని మేమెక్కడా ఉపయోగించలేదు. అలాంటి ఆలోచనే లేదు” అని తేజ స్పష్టం చేశాడు.

“మిరాయి” టైటిల్ అర్థం

తేజ సజ్జా మాటల్లో –

“ మిరాయి అంటే ‘భవిష్యత్తుపై ఆశ’ అని అర్థం. అయితే ఇందులో మరో లోతైన అర్థం కూడా ఉంది. ఆ ఇంటర్‌ప్రిటేషన్ మాత్రం థియేటర్‌లో చూసినప్పుడు ఆడియెన్స్‌కు సర్‌ప్రైజ్‌గా అనిపిస్తుంది.”

లార్డ్ శ్రీరామ్ యాంగిల్

“సినిమాలో లార్డ్ శ్రీరామ్ పాత్ర వచ్చే టైమింగ్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఆ ఎపిసోడ్ థియేటర్‌లో చూసినప్పుడు ఆడియెన్స్‌కి ఒక అద్భుతమైన హై వస్తుంది. ఇంకా చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి” అని చెప్పాడు తేజ.

“హను మాన్”తో పోల్చొద్దు

“ హను మాన్ కథ పూర్తిగా అంజనాద్రి అనే ఫాంటసీ వరల్డ్‌లో జరిగింది. కానీ మిరాయి మాత్రం పలు దేశాల్లో సాగే గ్లోబల్ స్టోరీ. క్యారెక్టర్స్, స్టోరీ టెల్లింగ్ అన్నీ డిఫరెంట్” అని తేజ క్లారిటీ ఇచ్చాడు.

రిలీజ్ డేట్, క్రేజ్

కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. హీరోయిన్‌గా రీతికా నాయక్ నటిస్తోంది.
సెప్టెంబర్ 12, 2025 న ప్రేక్షకుల ముందుకు రానున్న “మిరాయి”పై ఇప్పుడే అపారమైన క్రేజ్ నెలకొంది. “హను మాన్” తర్వాత తేజ సజ్జా చేస్తున్న భారీ విజువల్ స్పెక్టకిల్ కావడంతో, ఫ్యాన్స్ మాత్రమే కాదు, ట్రేడ్ కూడా భారీ హోప్‌తో ఎదురుచూస్తోంది.

ఇప్పటికే టీజర్, అప్‌డేట్స్ సినిమాకు మాస్-క్లాస్ రెండింట్లోనూ బజ్ క్రియేట్ చేశాయి. సోషల్ మీడియాలో “మిరాయి” అనే పేరు ఒక్కటే ట్రెండింగ్ అవుతుండటం, ఈ సినిమాపై ఎంత ఎగ్జైట్‌మెంట్ ఉందో చెప్పేస్తోంది.

, , , , , ,
You may also like
Latest Posts from