గత కొంతకాలంగా నితిన్‌కు “హిట్” అనే పదం, టచ్‌లో లేదనిపిస్తోంది. 2020లో వచ్చిన భీష్మ తర్వాత, అతని కెరీర్‌కు బ్రేక్ లేవలేని బ్రేకులు వచ్చాయి. చెక్, రంగ్ దే, మాయస్ట్రో, మచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా ఓర్డినరీ మాన్, రాబిన్‌హుడ్… ఇప్పుడు తమ్ముడు కూడా ఆ జాబితాలో చేరిపోయింది. అంటే, ఏడో పరాజయం.
ఈసారి నితిన్ ఆశలు పెట్టుకున్నది తమ్ముడు పై. ట్రైలర్ ఆకట్టుకుంది, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శ్రీరాం వేణు (MCA, వకీల్ సాబ్ ఫేమ్) – అంతా ఓ కమర్షియల్ కమ్‌బ్యాక్‌కు అనుకూలంగా కనిపించాయి. కానీ ప్రేక్షకుడి తీర్పు అంతే నిర్దాక్షిణ్యంగా తీర్పు చెప్పింది. “తమ్ముడు” డిజాస్టర్ అయిపోయింది.
ఇప్పుడు నితిన్ ఎదురు చూసే రెండు కొత్త ప్రయత్నాలు ఉన్నాయి –
యల్లమ్మ (బలగం వేణు దర్శకత్వంలో – తెలంగాణ ఫోక్ టోన్?)
విక్రమ్ కుమార్ డైరెక్షన్లో ఓ ఎమోషనల్ డ్రామా
ఇప్పుడు నితిన్ ఎదురు చూస్తున్నది ఒక్క హిట్ కాదు.
ఒక తిరుగు ప్రయాణం.