1982లో “Gandhi” సినిమా ఆస్కార్ వేదికపై అద్బుతం సృష్టించింది. 8 Academy Awards అందుకున్న ఈ బయోపిక్, “Best Picture” కూడా గెలుచుకుంది. కానీ ఆ విజయంలో అసలు విషయం ఎక్కడుందంటే… ఆ ఏడాది గాంధీ చిత్రానికి ఉన్న పోటీ దారుల్ని చూసినప్పుడు తెలుస్తుంది.

ఈ సినిమా ఓడించినవి చిన్నవేమీ కాదు —

“E.T. the Extra-Terrestrial” (Steven Spielberg డైరెక్షన్‌లో విజువల్ అద్భుతం, భావోద్వేగాల మిళితం)

“Tootsie” (Dustin Hoffman నటనతో క్లాసిక్ కామెడీ డ్రామా)

ఈ రెండు సినిమాలు అప్పట్లోనే కాదు, ఇప్పటికీ క్లాసిక్స్‌గానే నిలిచిపోయాయి.

మరి అవి ఉండగానే గాంధీ బెస్ట్ పిక్చర్ ఎలా గెలిచింది?

సినిమా నిపుణులంతా అప్పట్లో ప్రశంసలతో పాటు ఈ విషయమై ప్రశ్నలు కూడా వేశారు.
ఇవాళ్టికీ కొందరు ఈ నిర్ణయాన్ని తిరిగి పరిగణించాలనే అభిప్రాయం కలిగివుంటారు.

టారంటినోకి అసహనం!

ప్రముఖ దర్శకుడు క్వెంటిన్ టారంటినో, తన “Inglourious Basterds” సినిమా ఆస్కార్‌ను “The Hurt Locker”కి కోల్పోయిన సందర్భాన్ని ఇలా పోల్చాడు:

“It’s not like I lost to something dreadful… It’s not like E.T. losing to Gandhi.”

అంటే తన సినిమా ఓడిన పట్ల ఆవేదనను చెప్పినప్పటికీ… “E.T.” ఓటమి అతనికి ఇంకా బాధగా అనిపించినట్టు స్పష్టంగా చెప్పారు.

ఆ సిగ్నేచర్ స్టేట్‌మెంట్: Gandhi vs Cinema Magic

ఇది కేవలం వ్యాఖ్యాతల అభిప్రాయం అనుకుంటే… గాంధీ దర్శకుడు Richard Attenborough స్వయంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యపోతారు:

“E.T. was more entitled to an Oscar than Gandhi. E.T. was a better piece of cinema.”

ఒక దర్శకుడు తానే తీసిన సినిమాకంటే ప్రత్యర్థి సినిమా గొప్పదని ఒప్పుకోవడం… చాలా అరుదైన విషయం.

అయితే, గాంధీ ఎందుకు గెలిచింది? ఇదీ మనం అసలు మాట్లాడుకోవాల్సిన విషయం

“Gandhi” సినిమాకున్న గొప్పదనం:

గాంధీ పాత్రలో Ben Kingsley అభినయం అద్భుతం.

స్వాతంత్ర్యోద్యమం, అహింసా సిద్ధాంతాన్ని అద్భుతంగా చూపిన విధానం.

ఇది కేవలం బయోపిక్ కాదు – అది ఒక entire civilizationపై ఫిల్మ్.

అలాగే, ఈ సినిమా అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ, సామాజిక చైతన్యానికి ప్రతిరూపంగా నిలిచింది.

ఒక వైపు గాంధీ – చరిత్ర
మరోవైపు E.T. – చిత్రం తలిపించే భావోద్వేగం
వాటిలో గెలిచింది చరిత్రపట్ల గౌరవం.

Tootsie నవ్వించింది, E.T. ఆకట్టుకుంది… గాంధీ మనల్ని మేల్కొలిపింది!

42 ఏళ్లు గడిచినా… గాంధీ ఓ గొప్ప సినిమా అనే విషయాన్ని ఎవరూ ఖండించలేరు. అది ఒక వ్యక్తిని చూపించిన విధానం కాదు… మనం ఎలా ముందుకు నడవాలో నేర్పిన దిశ.

, , , , ,
You may also like
Latest Posts from