కొన్ని సినిమాల కోసం పిల్లలు, పెద్దలు ఎదురుచూస్తూంటారు. అలాంటి సినిమాల్లో ఒకటి ది వైల్డ్ రోబో(The Wild Robot) అనే యానిమేషన్ చిత్రం. రూ.670 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.2800 కోట్లు వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. గతేడాది థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించిన ఈ మూవీ.. కొన్నాళ్లుగా అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు ఉచితంగా చూడటానికి అందుబాటులోకి వచ్చేసింది. అయితే తెలుగు వెర్షన్ ఎక్కడ చూడవచ్చు.

ది వైల్డ్ రోబో మూవీ ఇప్పుడు జియోహాట్‌స్టార్ లోకి స్ట్రీమింగ్ కు రావడం విశేషం. ఇప్పటికే ఈ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వాళ్లు ఫ్రీగా ఈ సినిమాను చూడొచ్చు.

2016లో పీటర్ బ్రౌన్ రాసిన ది వైల్డ్ రోబో నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. క్రిస్ సాండర్స్ డైరెక్ట్ చేయగా.. లుపితా న్యోంగో, పెడ్రో పాస్కల్, కిట్ కానర్, బిల్ నిగీ, స్టెఫానీ సులాంటి వాళ్లు నటించారు.

స్టోరీ లైన్ ఏంటి

ది వైల్డ్ రోబో మూవీ రోజ్ (న్యోంగో) అనే సర్వీస్ రోబో చుట్టూ తిరిగే స్టోరీ. ఆ రోబో ఓ ఓడ ధ్వంసం కావడంతో ఎక్కడో ఓ మారుమూల దీవిలో చిక్కుకుపోతుంది. అక్కడి కఠినమైన పరిస్థితులకు అలవాటు పడటంతోపాటు ఆ దీవిలో ఉన్న జంతువులతో మమేకమై ఆ రోబో ఎలా మనుగడ సాగించిందన్నది ఈ సినిమాలో చూడొచ్చు.

కొన్నిసార్లు మనుగడ సాగించాలంటే ప్రోగ్రామ్ చేసిన దాని కంటే ఎక్కువ పనే చేయాల్సి ఉంటుందనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. డ్రీమ్‌వర్క్స్ యానిమినేషన్ మూవీని నిర్మించింది.

You may also like
Latest Posts from