మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతున్నారు. వరుస సినిమాలతో చేస్తున్న ఈ మలయాళ స్టార్ మోహన్‌లాల్ కామెడీ సినిమాలు కెరీర్ ప్రారంభంలో చేసారు. అయితే ఇప్పుడు ఆయన తుడరమ్ అనే క్రైమ్ థ్రిల్లర్‌లో ఆయన కనిపించనున్నారు. తాజాగా ఆ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూసిన వారు వింటేజ్ మోహన్ లాల్ ని చూసామంటున్నారు.
ఈ చిత్రంలో మోహన్ లాల్ జోడీగా శోభన హీరోయిన్‌గా నటించారు. ట్రైలర్ చూస్తే క్రైమ్ కామెడీ చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు తరుణ్ మూర్తి దర్శకత్వం వహించారు.
ట్రైలర్ లో కామెడీని ఓ రేంజ్ లో హైలైట్ చేసారు. సీనియర్ నటి శోభన-మోహన్ లాల్ రొమాంటిక్ ఎపిసోడ్ అంతే హైలైట్ అవుతుంది
ఈ మూవీలో మోహన్‌లాల్ షణ్ముఖం పాత్రను పోషిస్తుండగా.. శోభన లలితగా కనిపించింది. ఈ సినిమాను రెజపుత్ర విజువల్ మీడియా బ్యానర్‌పై ఎం రెంజిత్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.
ఇక మోహన్ లాల్ నటించిన ఎల్2 ఎంపురాన్ ఈ రోజు (మార్చి 27)రిలీజైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సలార్ లో కీలక పాత్ర పోషించిన పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. గతంలో లూసిఫర్‌కు సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు.