
“సీఎం రేవంత్ రూల్‌కి నిర్మాతలు ఓకే చెబుతారా?” – టాలీవుడ్‌లో హాట్ టాపిక్!
తెలంగాణ ముఖ్యమంత్రి అ. రేవంత్ రెడ్డి తాజాగా సినీ కార్మికుల సత్కార సభలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీశాయి.
సీఎం స్పష్టంగా ప్రకటించారు —
“సినిమా నిర్మాతలు టికెట్ ధరలు పెంచుకోవచ్చు, కానీ పెరిగిన రేట్ల వల్ల వచ్చే లాభంలో 20 శాతం మొత్తాన్ని సినీ కార్మికుల సంక్షేమ నిధికి తప్పనిసరిగా ఇవ్వాలి. ఈ నిబంధన పాటించే వారికే ఇకపై టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇస్తాం.”
ఈ ప్రకటన తర్వాత నిర్మాతల్లో కలకలం చెలరేగింది. ఎవరికి లాభం? ఎవరికీ నష్టం? అన్న చర్చ ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తాన్ని కుదిపేస్తోంది.
ప్రొడ్యూసర్లు ఎం చేస్తారు? సమావేశాల సిరీస్ రెడీ!
ఈ కొత్త షరతుపై నిర్మాతలు తక్షణమే స్పందించకపోయినా, ఫిల్మ్ చాంబర్, ప్రొడ్యూసర్స్ గిల్డ్, మరియు యూనియన్లు కలిసి దీనిపై చర్చించేందుకు ఒక సిరీస్ మీటింగ్‌లు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ప్రధాన సమస్య ఏమిటంటే ఆ 20 శాతం లాభాన్ని ఎలా లెక్కించాలి? టికెట్ ధరల పెంపుతో వచ్చే రియల్ ప్రాఫిట్‌ను ఎవరు ట్రాక్ చేస్తారు?. ప్రతి సినిమా కోసం నిర్మాతలు రిపోర్ట్ సమర్పించాలా? లేక ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తుందా? ఈ అంశాలపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు.
సున్నితమైన సిట్యువేషన్ — ప్రభుత్వానికి, నిర్మాతలకు టఫ్ బ్యాలెన్స్
సీఎం రేవంత్ నిర్ణయం కార్మికుల సంక్షేమం కోసం ఉన్నప్పటికీ, దీని అమలు ప్రాక్టికల్‌గా కాస్త కఠినమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అనుసరణలో పొరపాటు జరిగితే, టాలీవుడ్ నిర్మాతలు – తెలంగాణ ప్రభుత్వ మధ్య విభేదాలు తీవ్రం కావొచ్చు.
ఈ కారణంగా నిర్మాతలు కూడా బాక్సాఫీస్ ట్రాకింగ్ ప్యానెల్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారట. టికెట్ రేట్ల పెంపుతో వచ్చిన కలెక్షన్లు పూర్తిగా పారదర్శకంగా ఉండేలా చూసేందుకు.
ఇండస్ట్రీలో ప్రశ్న ఇదే — “రేవంత్ డీల్‌కి టాలీవుడ్ ఓకే చెబుతుందా?”
రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ “20% రూల్” కొంతమందికి సోషల్ సెన్స్ ఉన్న డెసిషన్గా కనిపిస్తుండగా, మరికొందరికి ప్రొడ్యూసర్లపై అదనపు ఒత్తిడిగా అనిపిస్తోంది.
ఫైనల్‌గా —
సినిమా టికెట్ పెంపు ఇంత సీరియస్‌గా మారింది ఎప్పుడూ కాదు! ఇప్పుడు అందరి చూపులు ఒకదానిపైనే ..“ప్రొడ్యూసర్లు రేవంత్ రూల్‌కి హ్యాండ్షేక్ ఇస్తారా? లేక హెడ్షేక్?”
