తెలుగు సినీ పరిశ్రమలో టాప్ ప్రొడ్యూసర్ అనే ట్యాగ్ సంపాదించుకున్న దిల్ రాజు… ఈ మధ్యకాలంలో మాత్రం ఒక విచిత్రమైన పరిస్థితిలో చిక్కుకున్నాడు. టాలీవుడ్ టాప్ హీరోలు ఎవ్వరూ తన లైన్‌లో లేరు, కొత్త ప్రాజెక్టులు కూడా ఫిక్స్ కాకపోవడంతో… ఈ స్థాయి ప్రొడ్యూసర్‌కు ఏంటి ఈ పరిస్థితి? అన్న ప్రశ్న ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇప్పటివరకు స్టార్ హీరోలతో వరుస బిగ్ సినిమాలు చేసిన రాజు, ప్రస్తుతం తన లైన్‌అప్‌లో అలాంటి భారీ ప్రాజెక్టులు లేవు. అందుకే కళ్లను నేరుగా కొలీవుడ్ వైపు తిప్పేశాడు.

విజయ్‌తో చేసిన Varisu ద్వారా ఇప్పటికే తమిళంలో ఎంట్రీ ఇచ్చిన దిల్ రాజు, ఇప్పుడు అజిత్ వైపు సీరియస్‌గా అడుగులు వేస్తున్నాడట.

మైక్రో దర్శకుడు హనీఫ్ అదేనితో ఒక వైలెంట్ యాక్షన్ డ్రామా ప్లాన్ అవుతోందని, అందుకోసమే అజిత్‌ని సంప్రదించారన్నది ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట.

ఇక మరోవైపు, Good Bad Ugly తర్వాత అజిత్ ఇప్పటికే ఆధ్యిక్ రవిచంద్రన్‌తో సినిమా కన్‌ఫామ్ చేసుకున్నారు. ఆ తర్వాతి ప్రాజెక్ట్‌గానే దిల్ రాజు సినిమా వస్తుంది అనేది ఇండస్ట్రీ టాక్.

ముఖ్యంగా, అజిత్ పారితోషికం ఆకాశాన్నంటుతుండటంతో… దిల్ రాజు ఏ స్థాయిలో డీల్ కుదుర్చుకుంటాడన్నది మిస్టరీగా మారింది.

, , , , ,
You may also like
Latest Posts from