ఇరవై ఏళ్లకు పైగా టాలీవుడ్, కోలీవుడ్‌లో హీరోయిన్‌గా కొనసాగుతున్న త్రిష సినీ కెరీర్ ఎంత బిజీగా ఉన్నా, తన సామాజిక బాధ్యతను మాత్రం మరిచిపోవడం లేదు. ఇటీవలే నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన త్రిష, మరోసారి తన మంచితనంతో వార్తల్లో నిలిచింది.
తాజాగా త్రిష తమిళనాడులోని అరుప్పుకొట్టైలో ఉన్న అష్టలింగ ఆదిశేష సెల్వ వినాయకర్ ఆలయానికి ఒక రోబోటిక్ ఏనుగును బహూకరించింది. పీపుల్స్ ఫర్ క్యాటిల్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి త్రిష ఈ “మెకానికల్ గజ”ను ఆలయానికి అందజేసింది. భక్తులు పెద్ద ఎత్తున త్రిష మంచితనాన్ని ప్రశంసిస్తున్నారు. ఆలయ అధికారులు ఆ ఏనుగుకు ‘గజ’ అనే పేరు పెట్టారు.
ఇటీవల నిజమైన ఏనుగులను వినియోగించడంలో భద్రతా సమస్యలు ఏర్పడుతుండడంతో, రోబో ఏనుగులు ఆలయాల్లోని ఉత్సవాలకు శ్రేయస్కరంగా మారాయి. పూజల్లో ప్రమాదం లేకుండా ఉండేందుకు ఈ మార్గాన్ని త్రిష లాంటి సెలబ్రిటీలు స్వీకరిస్తుండటం ఎంతో మంచిదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. స్థానిక స్వచ్ఛంద సంస్థ పీపుల్స్ ఫర్ క్యాటిల్ ఇండియాతో కలిసి త్రిష ఈ ఏనుగును బహుమానంగా ఇచ్చిందని స్థానికులు చెబుతున్నారు.