ఒక భాషలో సక్సెస్ అయిన సినిమాలను డబ్‌ చేసి, ఇతర భాషల ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం చాలా కాలంగా జరుగుతున్నదే. దాన్నే ఓటీటీ వేదికలు సైతం అందిపుచ్చుకుని ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు (జనవరి 24) ప్రేక్షకుల ముందుకు వచ్చిన మలయాళ మిస్టరీ థ్రిల్లర్‌ ‘ఐడెంటిటీ’ (Identity).

టొవినో థామస్‌ (Tovino Thomas), త్రిష (Trisha Krishnan) ప్రధాన పాత్రల్లో అఖిల్‌ పాల్‌, అనాస్‌ఖాన్‌ సంయుక్తంగా తెరకెక్కించిన చిత్రమిది. మలయాళంలో పాజిటివ్‌ టాక్‌ రావడం, సంక్రాంతి తర్వాత తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడంతో ఈ మూవీని ఇక్కడ థియేటర్స్‌లో విడుదల చేశారు.

ఇదిలా ఉంటే, ‘ఐడెంటిటీ’ని ఓటీటీలో రైట్స్‌ను ప్రముఖ స్ట్రీమింగ్‌ వేదిక జీ5 దక్కించుకుంది. మలయాళ థియేట్రికల్‌ రన్‌ పూర్తయిన తర్వాత స్ట్రీమింగ్‌ కావాల్సి ఉంది. దీంతో తాజాగా స్ట్రీమింగ్‌ తేదీని ప్రకటించింది.

జనవరి 31న జీ5లో (identity ott release) మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర టీమ్ పోస్టర్‌ను పంచుకుంది. అంటే, తెలుగులో విడుదలైన వారం రోజులకే ఈ మూవీ ఓటీటీలో వస్తుండటం గమనార్హం.

తక్కువ బడ్జెట్‌తో రూపొందించిన ఈ మూవీ మలయాళంలో రూ.18 కోట్లకు పైగా వసూలు చేసింది.

కథేమిటంటే…

ఓ కేసు విషయమై సీఐ అలెన్‌ (వినయ్‌ రాయ్‌).. అలీషా (త్రిష)ని ఇన్వెస్టిగేట్‌ చేసేందుకు కేరళ వెళ్తాడు. కానీ, రోడ్డు ప్రమాదానికి గురైన అలీషా.. మనుషులను గుర్తుపట్టలేకపోతుంటుంది. అలీషాకు సాయం చేసేందుకు వచ్చిన హరన్‌ (టొవినో) ఎవరు? అతడికి, అలెన్‌కు ఉన్న సంబంధమేంటి? అలీషా ఇచ్చిన వివరాలతో సీఐ కేసును చేధించగలిగాడా? తదితర ఆసక్తికర అంశాలతో తెరకెక్కిందీ చిత్రం.

, ,
You may also like
Latest Posts from