త్రివిక్రమ్ సినిమా అంటే థమన్ మ్యూజిక్ — ఈ కాంబో తెలుగు సినిమా ఫ్యాన్స్ మనసుల్లో ఒక బ్రాండ్‌గా మారిపోయింది. “బుట్ట బొమ్మ”, “రాములో రాములా”, “పెనివిటీ” లాంటి పాటలతో ఈ జంట సృష్టించిన మ్యాజిక్ ఇప్పటికీ చెదరలేదు. అయితే ఇప్పుడు, వెంకటేష్ హీరోగా చేస్తున్న కొత్త చిత్రానికి త్రివిక్రమ్ ఆశ్చర్యంగా థమన్ స్థానంలో హర్షవర్ధన్ రామేశ్వర్ ని ఎంపిక చేయడం ఫిల్మ్‌నగర్‌లో పెద్ద చర్చగా మారింది.

ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం — థమన్ ప్రస్తుతం బిజీ షెడ్యూల్‌లో ఉన్నాడట. పలు స్టార్ సినిమాలకు ఒకేసారి మ్యూజిక్ అందిస్తుండటంతో టైమ్ మేనేజ్ చేయడం కష్టమవుతోందట. అంతేకాదు, ఆయన పారితోషికం కూడా గణనీయంగా పెరిగిందట.

త్రివిక్రమ్ అయితే ఈసారి తన సినిమాపై ఎక్కువ సమయం, అటెన్షన్ పెట్టగల మ్యూజిక్ డైరెక్టర్‌ని కోరుకున్నాడట. అందుకే కొత్త ఎనర్జీతో, వేరే మ్యూజిక్ ఫ్లేవర్ ఇవ్వగల హర్షవర్ధన్ రామేశ్వర్‌నే ఎంపిక చేశాడని సమాచారం.

అయితే ఇది ఎటువంటి విభేదాల వల్ల జరిగిన నిర్ణయం కాదు. త్రివిక్రమ్ – థమన్ మధ్య బంధం యథాతథంగానే ఉందట. ఇది కేవలం ప్రాజెక్ట్ అవసరం మాత్రమే. వెంకటేష్ సినిమా రిలీజ్ ముందు హైప్‌కి హైప్‌ కాకుండా, థియేటర్లలో కలెక్షన్‌లతోనే మాట్లాడేలా ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్, ఈసారి స్మార్ట్ మ్యూజికల్ డెసిషన్ తీసుకున్నట్టే!

, , , ,
You may also like
Latest Posts from