బాలీవుడ్ లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. తమ పాత ప్రేమాయణాలు తవ్వి తీస్తున్నారు. తాజాగా నటి సోనమ్ కపూర్ తాజాగా తన పెళ్లికి ముందు జరిగిన ప్రేమాయణాల గురించి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. “ఒకేసారి ఇద్దరు అబ్బాయిలతో డేటింగ్ చేశాను… వాళ్లిద్దరికీ తెలియకుండా!” అని చెప్పిన ఆమె మాటలు విని ఫ్యాన్స్ తల పట్టుకుంటున్నారు.
ఈ క్రమంలో ట్రూ లవ్ , హ్యాపీ ఎండింగ్స్ అనే కాన్సెప్ట్‌లపై సినిమాలు తీసే సెలెబ్రిటీలు అసలైన జీవితంలో మాత్రం లవ్ గేమ్స్ ఆడుతూ తిరుగుతారా? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
ఇప్పటికే దీపికా పదుకొణే ‘కాఫీ విత్ కరణ్’లో ఇదే తరహాలో ఓ కామెంట్ చేసింది. “అప్పటికే రణవీర్ సింగ్‌ని ప్రేమిస్తూనే ఉన్నాను. కానీ ఇంకొంతమందిని కూడా కలుస్తూనే ఉన్నాను,” అని చెప్పిన ఆమె, “నా మనసులో మాత్రం నేను రణవీర్‌కే కమిటయ్యాను” అని పేర్కొనడం నెటిజన్లను విస్మయానికి గురిచేసింది.
ఇప్పుడు సోనమ్ చెప్పిన విషయంతో, ఈ సెలెబ్రిటీల ప్రేమపట్ల నిబద్ధతపై పెద్ద చర్చ మొదలైంది. “ప్రేమపై సినిమాలు తీయడం ఒకటి, నిజ జీవితంలో ప్రేమను గౌరవించడం మరోటి” అని ట్రోల్స్ ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. సోనమ్ కపూర్ కెరీర్ ఫ్లాప్ అవ్వడంతో, “ఇప్పుడు పబ్లిసిటీ కోసం ఏం కావాలన్నా చెబుతుందా?” అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వ్యవహారంపై మీ అభిప్రాయం ఏంటి?
నిజ జీవిత ప్రేమకి నిబద్ధత అనేది అవసరమా? లేక సెలెబ్రిటీల జీవితం ఇలాగే నడుస్తుంది అనుకుంటున్నారా?