కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర అన్నా ఆయన డైరక్ట్ చేసిన సినిమాలన్నా మన తెలుగు ఆడియెన్స్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. చాలా ఏళ్ల కితమే అడ్వాన్స్డ్ సినిమాలు తెరకెక్కించిన హీరో కం దర్శకుడు ఉపేంద్ర కాగా తన నుంచి చాలా కాలం తర్వాత వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ సినిమానే ‘యూఐ’.
భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్స్ లో కన్నడ సహా తెలుగు ఆడియెన్స్ కి కూడా ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ని అందించింది. అయితే సినిమా డిజాస్టర్ అయ్యింది. చాలా మందికి అర్దం కాలేదన్నారు. అయినా చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ సినిమా కథపై స్పందించాడు ఉప్పీ.
ఉపేంద్ర మాట్లాడుతూ… “ఆ సినిమా జనాలకు అర్థమవ్వడం చాలా కష్టం. ఆ విషయం నాకు తెలుసు. నేను ఏడేళ్ల నుంచి చెబుతూనే ఉన్నాను. ఈ సినిమాలో ఇంకాస్త స్ట్రాంగ్ గా చెప్పాను. నాకు తెలిసి మరో ఐదారేళ్ల తర్వాత ఈ సినిమా జనాలకు అర్థమౌతుంది.”
‘యుఐ’ సినిమాలో థియేటర్లలో కూర్చొని సినిమా చూసే ప్రేక్షకుల్నే విలన్లు అని చెప్పే ప్రయత్నం చేశాడు ఉపేంద్ర. దాన్ని జీర్ణించుకోవడం ప్రేక్షకులకు కాస్త కష్టమైందని, తెరపై విలన్ కోసం వెదికిన ఆడియన్స్ కు తామే విలన్ అని చెప్పేసరికి అర్థం చేసుకోలేకపోయారని అన్నాడు ఉపేంద్ర.
తెలివైన వాళ్లు కూర్చోండి, తెలివితేటలు లేనోళ్లు దయచేసి థియేటర్ల నుంచి వెళ్లిపోండి అంటూ సినిమా ప్రారంభంలోనే కార్డు వేశాడు ఉపేంద్ర. అదే నిజమైంది అన్నారు.