మొత్తానికి దర్శకుడు హరీష్ శంకర్ పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రాజెక్ట్ పై అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్నట్లు ఎక్స్ వేదికగా కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.
హరీష్ శంకర్ ప్రత్యేకంగా పవన్ అభిమానుల కోసం స్క్రిప్ట్‌ను పూర్తిగా రీమ్యాజిన్ చేసి, మాస్ ఎలిమెంట్స్‌తో నిండిన ఓ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌ను సిద్ధం చేశాడు. ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మాస్ ఫెస్ట్ అవబోతోంది.
వచ్చే నెల నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మాణానికి సిద్ధమైంది. నవీన్ ఎర్నేని మరియు వై రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
అలాగే ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా, సంగీతాన్ని దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఫాన్స్‌కు ఫుల్ ప్యాకేజ్ ఎంటర్ టైన్మెంట్ ఇవ్వాలని చిత్రబృందం భావిస్తోంది. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుండటంతో అభిమానులలో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.