పవన్ కళ్యాణ్‌ ఎలక్షన్స్ కు ముందు కమిట్ అయిన మరో సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన హరీశ్‌ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో సహజంగానే ఈ మూవీపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా ఇప్పుడిప్పుడే బయిటకు వచ్చేటట్లు కనపడటం లేదు.

కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ పవన్ కళ్యాణ్ రాజకీయ కమిట్ మెంట్స్ కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతానికి, సినిమా నిర్మాణాన్ని తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తుందనే దానిపై అధికారిక సమాచారం లేదు. అయితే,అందుతున్న సమాచం ప్రకారం, ఈ సంవత్సరం మళ్లీ సెట్స్ కు వెళ్లే అవకాశం అయితే లేదు. పవన్ కళ్యాణ్ … ఉస్తాద్ భగత్ సింగ్ వద్దకు తిరిగి వచ్చే ముందు హరి హర వీర మల్లు మరియు OGని పూర్తి చేయాల్సి ఉంది.

ఇక ఇది తమిళ చిత్రం ‘తేరీ’కి రీమేక్ అనే ప్రచారం జరుగుతూ ఉండటం, ఇటీవల హరీశ్‌ రవితేజతో తీసిన హిందీ రీమేక్ ‘మిస్టర్ బచ్చన్’ పరాజయం కావడంతో కొంత ఈ ప్రాజెక్ట్ పై నీలినీడలు కమ్ముకున్నాయి.

ఈ నేపథ్యంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఇక ఉండకపోవచ్చునేమో అనే అనుమానాలూ వ్యక్తం అయ్యాయి. అయితే… హరీశ్‌ శంకర్ మాత్రం ‘మిస్టర్ బచ్చన్’ పరాజయం తర్వాత స్క్రిప్ట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని, మెరుగులు దిద్దాడని సన్నిహితులు చెబుతున్నారు.

, , ,
You may also like
Latest Posts from