సినిమా వార్తలు

“మాకు కూడా IMAX కావాలి!”- వారణాసి గ్లింప్స్‌తో సోషల్ మీడియాలో రచ్చ!

మహేష్ బాబు–రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అతి భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ సోషల్ మీడియాలో ఊహించని హంగామా క్రియేట్ చేస్తోంది. కాన్సెప్ట్, స్కేలు, విజువల్ రేంజ్ గురించి డిస్కషన్లు ఒక్కసారిగా పీకు చేరుకోగా… ఇప్పుడు ఫ్యాన్స్ మరో డిమాండ్‌తో ముందుకు వచ్చారు.
“తెలుగు రాష్ట్రాల్లో IMAX తెప్పించండి… లేదంటే ‘వారణాసి’ ఎంజాయ్ ఎలా చేస్తాము?”

IMAX టెక్నాలజీతో ‘వారణాసి’—రాజమౌళి చెప్పిన మాట ఒక్కటే దేశవ్యాప్తంగా ట్రెండ్!

గ్లోబ్‌ట్రాట్టర్ ఈవెంట్‌లో రాజమౌళి స్పష్టంగా చెప్పారు—

“వారణాసి కొత్త IMAX టెక్నాలజీతో వస్తుంది. కేవలం కన్వర్ట్ చేయడం కాదు… పూర్తిగా ఫుల్-ఫ్రేమ్ IMAX!”. బాహుబలి, RRR సినిమాలకు IMAX వెర్షన్స్ ఉన్నా… అవి ప్రధానంగా కన్వర్టెడ్ ఫార్మాట్. కానీ ‘వారణాసి’ మాత్రం ప్యూర్ IMAX, ఫుల్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్!

అందుకే ఫ్యాన్స్ చెబుతున్నది ఒక్కటే:
“ఇలాంటిది థియేటర్‌లో కాకుంటే ఎక్కడ చూస్తాం? మాకు కూడా IMAX కావాలి!”

IMAX ఇండియాలో ఉన్నా… తెలుగు రాష్ట్రాల్లో ఒక్క స్క్రీన్ కూడా లేదు!

దిల్లీ, ముంబై, చెన్నై, పుణే, బెంగళూరు, కోచి, అహ్మదాబాద్, ఇలా దాదాపు దేశంలోని అన్ని మెట్రోల్లో IMAX ఉంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఒక్కటీ లేదు!

ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్.
ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు—
“RRR, బాహుబలి ఇచ్చిన ఇండస్ట్రీకి IMAX లేని పరిస్థితి ఏంటి?”

‘వారణాసి’ గ్లింప్స్ చూసాక డిమాండ్ రెట్టింపు!

గ్లింప్స్‌లో కనిపించిన స్పాన్… విజువల్స్… మహేష్ లుక్… అన్నీ చూసిన తర్వాత ఫ్యాన్స్ డైరెక్ట్‌గా చెప్పేస్తున్నారు:
“ఈ సినిమా IMAX లోనే చూడాలి… లేకపోతే రేంజ్ హాఫ్ అవుతుంది!”

థియేటర్ ఓనర్స్, ఎగ్జిబిటర్స్‌తో పాటు ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో ముందుకు రావాలంటూ సోషల్ మీడియాలో పెద్ద క్యాంపెయిన్ మొదలైంది. రాజమౌళి కూడా అదే అభిప్రాయంతో ఉన్నట్టే ఈవెంట్‌లో స్పష్టంగా సూచించారు—
“తెలుగు రాష్ట్రాల్లో IMAX రావాల్సిన టైం అయింది.”

Similar Posts