విజయ్ దేవరకొండ ఫుల్ బిజీ అవుతున్నాడు. వరస ఫ్లాఫ్ లతో కెరీర్ పరంగా వెనక్కి వెళ్లిన విజయ్ మంచి కసితో ఎలాగైనా హిట్ కొట్టి తీరాలని ప్రాజెక్టులు లైనప్ పెడుతున్నారు. ఈ క్రమంలో దిల్ రాజు తో ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాలో కీర్తి సురేష్ హీరోయన్ గా చేస్తోందని తెలుస్తోంది. ఈ మేరకు ఎగ్రిమెంట్ జరిగిందని వినికిడి.
వివరాల్లోకి వెళితే…
విజయ్ దేవరకొండ హీరోగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన సినిమా ఫ్యామిలీ స్టార్. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. నిర్మాత దిల్ రాజుకు భారీ నష్టాలు మిగిల్చింది.
ఆ నష్టాలు తీర్చేందుకు దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. గతేడాది మే నెలలో దిల్ రాజు నిర్మాణంలో సినిమాను ప్రకటించాడు విజయ్ దేవరకొండ.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా ‘రాజావారు రాణి వారు’ అనే సినిమాను డైరెక్ట్ చేసిన రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి.
ఇప్పటికే విజయ్ దేవరకొండ సినిమా టైటిల్ ను రివీల్ చేసారు దిల్ రాజు. రవి కిరణ్ దర్శకత్వంలో విజయ్ తో ‘రౌడీ జనార్ధన్’ అనే సినిమా చేస్తున్నాం అని చెప్పారు. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాగా రానుంది. గతంలో రిలీజ్ చేసిన పోస్టర్ ఈ సినిమాపై క్యూరియాసిటీ పెంచింది. కాగా ఈ సినిమాను తెలుగు, కన్నడ, హిందీ, తమిళ భాషల్లో రానుంది.