విజయ దేవరకొండ(Vijay Devarakonda) హీరో గా టాలెంటెడ్ డైరక్టర్ గౌతమ్ తిన్ననూరి (Goutham Thinnanuri) దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం టీజర్ తాజాగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ‘VD12’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘కింగ్‌డమ్’ (KINGDOM)అనే శక్తివంతమైన టైటిల్ ను ఖరారు చేసినట్లు టీజర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు. ఈ టీజర్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతోంది. ఈ టీజర్ చూసాక సినీ ప్రియులతో పాటు, సాధారణ ప్రేక్షకులలోనూ భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపధ్యంలో ఈ టీజర్ ని చూసిన రామ్ చరణ్ అభిమానులకు బాధ కలుగుతోంది.
అందుకు కారణం మొదట ఈ ప్రాజెక్టుని రామ్ చరణ్ చేయాల్సింది. అతను కాదంటేనే విజయ్ దేవరకొండ దగ్గరకు వచ్చింది. రామ్ చరణ్ పూర్తిగా శంకర్ సినిమాకే డేట్స్ కేటాయించి ఈ సినిమాని పట్టించుకోలేదు. చరణ్ ఫ్యాన్స్ కూడా గౌతమ్ తిన్ననూరి అనగానే లైట్ తీసుకున్నారు.
అయితే ఊహించని విధంగా ‘కింగ్‌డమ్’ టీజర్ అద్భుతంగా ఉంది. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు, కట్టిపడేసే భావోద్వేగాలతో థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించే యాక్షన్ డ్రామాగా ‘కింగ్‌డమ్’ రూపొందుతోందని టీజర్ తో స్పష్టం చేశారు. ఈ ఇంటెన్స్ టీజర్ తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇది ఖచ్చితంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ కు బాధ కలిగించేదే. ఇలాంటి డ్రామా తమ హీరోకు పడితేనా అని సోషల్ మీడియాలో తమ బాధను షేర్ చేసుకుంటున్నారు.
‘కింగ్‌డమ్’ టీజర్ తెలుగు వెర్షన్‌కి జూనియర్ ఎన్టీఆర్, తమిళ వెర్షన్‌కి సూర్య, హిందీ వెర్షన్‌కి రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ అందించారు. ఈ ముగ్గురు స్టార్లు తమ గొంతుతో రోమాలు నిక్కబొడుచుకునేలా చేసి, టీజర్‌ను మరో స్థాయికి తీసుకువెళ్లారు.
2025, మే 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో ‘కింగ్‌డమ్’ విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. విడుదల తర్వాత ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరికొత్త సంచలనాలు సృష్టించి, ఘన విజయం సాధిస్తుందని నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు.