ఒకప్పుడు తెలుగులో తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కు మంచి క్రేజ్ ఉండేది. శివపుత్రుడు, అపరిచితుడు వంటి సినిమాలు ఇక్కడ సెన్సేషన్ క్రియేట్ చేసాయి. అయితే ఆ స్దాయి సినిమా మళ్లీ పడలేదు. ఎప్పటికప్పుడు విక్రమ్ సినిమా రిలీజ్ అవటం, సైలెంట్ గా వెళ్లిపోవటం జరుగుతోంది. తాజాగా విక్రమ్ నటించిన మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్-ప్యాక్డ్ మూవీ వీర ధీర శూర రిలీజ్ కు రెడీ అయ్యింది.

మార్చి 27న గ్రాండ్‌గా వీర ధీర శూర సినిమా తమిళంతోపాటు తెలుగులో కూడా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా శనివారం (మార్చి 22) నాడు వీర ధీర శూర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అయినా ఇక్కడ మినిమం బజ్ కూడా క్రియేట్ కాలేదు. అందరి దృష్టీ నితిన్ రాబిన్ హుడ్, సితార రిలీజ్ చేస్తున్న కామెడీ చిత్రం మ్యాడ్ స్క్వేర్ పైనే ఉంది. ఈ సినిమా గురించి ఎవరూ మాట్లాడటం లేదు. తమిళంలో కూడా బజ్ లేదని తెలుస్తోంది.

విక్రమ్ మాట్లాడుతూ… “మార్చి 27న ఈ సినిమా వస్తోంది. ఇది అందరూ ఎంజాయ్ చేసే సినిమా. కచ్చితంగా మీరంతా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. ఈ సినిమా ఫస్ట్ షాట్ నుంచే కథ మొదలైపోతుంది. అందుచేత ఒక ఫైవ్ మినిట్స్ (ఐదు నిమిషాలు) ముందే థియేటర్‌లో ఉండేలా చూసుకోవాలని, సినిమా బిగినింగ్ ఎవ్వరు మిస్ అవ్వకూడదని ప్రేక్షకులుని కోరుతున్నాను” అని చియాన్ విక్రమ్ కోరాడు.

సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ఎస్‌యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పాపులర్ యాక్టర్ ఎస్‌జే సూర్య, మలయాళ స్టార్ నటుడు సూరజ్ వెంజరాముడు, హీరోయిన్ దుషారా విజయన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

, ,
You may also like
Latest Posts from